ఇద్దరికీ డాక్టరేట్లు ప్రధానం
ఎడ్యుకేషన్ స్టాప్ రిపోర్టర్ : శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఫార్మాస్యూటికల్ సైన్సెస్ కు చెందిన పరిశోధన విద్యార్థినిలు సి.శిల్పజా, కె.రమ్యకు డాక్టరేట్ ప్రదానం చేసినట్లు డీన్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ కె.అనురాధ తెలిపారు. వారి ఇరువురు అదే విభాగానికి చెందిన ప్రొఫెసర్ వై.ఇందిరా ముజిబ్, ప్రొఫెసర్ బి.జీవన జ్యోతి మార్గదర్శకత్వంలో “డిజైన్, డెవలప్‌మెంట్ అండ్ క్యారెక్టరైజేషన్ ఆఫ్ నానో-బేస్డ్ డ్రగ్ డెలివరీ సిస్టమ్స్ ఫర్ న్యూరోడీజెనరేటివ్ డిజార్డర్స్ యాజ్ ఇంట్రానాసల్ నానోపార్టిక్యులేట్ సిస్టమ్స్” అనే అంశంపై పరిశోధన పూర్తి చేశారు. ఇందుకుగాను వారి ఇరువురికి డాక్టర్ ప్రధానం చేసినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా వారికి పలువురు ఆచార్యులు, పరిశోధన విద్యార్థులు, కుటుంబ సభ్యులు అభినందనలు తెలియజేశారు.
సీఎం గౌడ్ తిరుపతి స్టాప్ రిపోర్టర్