BREAKING
S V V స్కూల్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు నేటి రాశి ఫలాలు 13 అక్టోబర్ 2026 నేటి పంచాంగం 13 అక్టోబర్ 2026 అల్లర్లకు పాల్పడితే ఉపేక్షించేది లేదు యువతను మోసం చేసిన కాంగ్రెస్ కు పట్టభద్రులు బుద్ధి చెప్పాలి మండల అభివృద్ధిపై సర్వసభ్య సమావేశం దర్యాప్తులో జాప్యం వద్దు.. విధుల్లో అప్రమత్తంగా ఉండాలి జానేష్ కుమార్ ను విధుల నుండి తొలగించాలి చుక్కలు చూపిస్తున్న బుకింగ్స్: ఢిల్లీ చారిత్రక 'రామ్‌లీలా మైదానం'లో ఈ ఏడాది మిగిలింది కేవలం 3 రోజులే.. కారణాలు ఇవే! యూఎస్ ‘పెర్మ్’ నిలిపివేతతో మాపై ఎలాంటి ప్రభావం ఉండదు: తేల్చిచెప్పిన హెచ్‌సీఎల్‌టెక్.. కారణాలు ఇవే! సముద్రాలలో నిరుపేదలకే ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి స్టార్‌లింక్ స్టేషన్ దగ్ధం కేసు...జర్మనీలో ఇద్దరు టర్కీ పౌరుల అరెస్ట్ సౌదీ అరేబియా వ్యూహాత్మక అడుగు: హార్ముజ్ జలసంధిపై ఆధారపడటం తగ్గించేలా.. పైప్‌లైన్ సామర్థ్యం 10 మిలియన్ బ్యారెళ్లకు పెంపు! విడుదల ముందే ఏఐ మోడళ్ల భద్రతా సమీక్ష: ట్రంప్ విధానాన్ని తిరస్కరిస్తూ యూకే ప్రభుత్వం కీలక నిర్ణయం! ఉత్తర ఇజ్రాయెల్‌లో పేలిన బాంబు

గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి పెద్దపీట: ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి

Select Suryaa Now
గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి పెద్దపీట: ఎంపీ  దగ్గుబాటి పురందేశ్వరి

దేవరపల్లి, అక్టోబర్ 11 మేజర్ న్యూస్:గ్రామీణ ప్రాంతాల సర్వతోముఖాభివృద్ధే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఎంపీ  దగ్గుబాటి పురందేశ్వరి స్పష్టం చేశారు. ఆదివారం దేవరపల్లి మండలం గౌరీపట్నం గ్రామంలో  చేపట్టిన పలు అభివృద్ధి పనులను గోపాలపురం నియోజకవర్గ శాసనసభ్యులు  మద్దిపాటి వెంకటరాజు, ఎంపీ  దగ్గుబాటి పురందేశ్వరి, తూర్పుగోదావరి జిల్లా టీడీపీ అధ్యక్షులు, రూడా చైర్మన్  బొడ్డు వెంకటరమణ చౌదరి, జనసేన నాయకులు దొడ్డిగర్ల సువర్ణరాజు ప్రారంభించి, శంకుస్థాపనలు చేశారు.ఈ సందర్భంగా వారు ముందుగా స్థానిక శివాలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

అనంతంరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు మాట్లాడుతూ, గౌరీపట్నం గ్రామంలో మౌలిక వసతులు, తాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతున్నామని, నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని, స్థానిక సంస్థలు ఎన్నికలలో కూటమి అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని  కోరారు. జనసేన నాయకులు దొడ్డిగర్ల సువర్ణరాజు మాట్లాడూతూ, కూటమి ప్రభుత్వ సమన్వయంతోనే గ్రామాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని, ప్రజల ఆశయాలకు అనుగుణంగా ప్రజాప్రతినిధులు నిరంతరం శ్రమిస్తున్నారని కొనియాడారు.

ఈ సందర్భంగా ఎంపీ పురందేశ్వరి రూ. 1.50 కోట్ల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్లను, రూ. 70 లక్షల వ్యయంతో నిర్మించిన ఓవర్‌హెడ్ ట్యాంక్, బోర్‌వెల్ ప్రారంభించారు, అదేవిధంగా ఎస్సీ కాలనీలో నూతన ఓవర్‌హెడ్ ట్యాంక్, బోర్‌వెల్ నిర్మాణానికి.సొసైటీ భవనం నిర్మాణానికి, స్వర్గీయ నందమూరి తారక రామారావు  విగ్రహ నిర్మాణానికి కూటమి నాయకులతో కలిపి  భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గౌరీపట్నం సొసైటీ అధ్యక్షులు అండ్రు అనిల్, కోఠారు ధ్రువకాంత్, ఆండ్రు సత్తిరాజు, బుల్లి రాజు, పాతూరి గిరిధర్, ఆండ్రు సతీష్, బీజేపీ నాయకులు కోలా రామకృష్ణ, దున్న సుమన్ బాబు, ఓరుగంటి వెంకటపతి రాజు, సన్నాయిల వెంకటేష్, పరిమి రాధా తదితరులు పాల్గొన్నారు.