BREAKING
దీక్ష దివస్ కార్యక్రమానికి బయలుదేరిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కొత్త ప్రభాకర్‌రెడ్డి చేతుల మీదుగా.. * టీఆర్‌ఆర్‌ఎస్‌ మహాసభ పోస్టర్ ఆవిష్కరణ.. ఘనంగా పోచమ్మ,ఎల్లమ్మ దేవాలయాల గడప నిర్మాణం కార్యక్రమం లక్షలు వెచ్చించి లక్షణంగా వదిలేశారు...... * సంవత్సరాలు గడుస్తున్న ప్రారంభానికి నోచుకోని హెల్త్ సెంటర్ భవనం బోరు మోటార్, దొంగల అరెస్ట్ మోటార్, కేబుల్ వైర్, పల్సర్ బైక్ స్వాధీనం పలుశుభ కార్యక్రమాలకు హాజరైన గ్రామ సర్పంచ్ బండారి లక్ష్మి & బాలరాజు కరీంనగర్‌లో దీక్షా దివస్ సభకు కదిలిన గుండారెడ్డిపల్లి గులాబీ దండు కోహెడ జూనియర్ క్రికెట్ జట్టుకు ఘన సన్మానం ముద్ర రుణం.. బ్యాంకు వసూళ్ల వేధింపులు! కేసీఆర్ నిరాహార దీక్ష.. తెలంగాణకు విజయదీక్ష! కేసీఆర్ దీక్షతోనే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి కీలక మలుపు! రామానుజ పల్లి సర్పంచ్ గా పొట్టేలి సుధా మరో అవకాశం.. నేడు కూడా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ అంతరాత్మకు కట్టుబడి నిష్పక్షపాతంగా తీర్పులు వెలువరించాలి కౌంటింగ్ కేంద్రాల వద్ద అప్రమత్తంగా ఉండాలి: జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు

గ్రామపంచాయతీ రెండో దశ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలి : జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి

Select Suryaa Now
గ్రామపంచాయతీ రెండో దశ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలి :  జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి

బాపట్ల, మేజర్‌న్యూస్‌ :

 గ్రామపంచాయతీ రెండో దశ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, తెలిపారు. గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణపై జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులతో శనివారం స్థానిక కలెక్టరేట్ నుంచి ఆయన వీక్షణ సమావేశం నిర్వహించారు.
      
       యంత్రాంగానికి ఇబ్బందులు వస్తే... అధైర్య పడొద్దు.. నేను మీకు తోడుగా ఉన్నానని కలెక్టర్ భరోసా ఇచ్చారు. ఏదైనా సమస్యలు వస్తాయని ఆందోళన చెందద్దు. ఏవేవో ఊహించుకుని ఎన్నికల విధులకు గైర్హాజరు కావద్దని హితవు పలికారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు సజావుగా సాగుతున్నాయని అన్నారు. జిల్లా అధికారులంతా వాకీటాకీలను ఉపయోగించాలన్నారు. గైర్హాజరైన వారికి షోకాజు నోటీసులు జారీ చేయాలన్నారు. గైర్హాజరైన ఉద్యోగులు సమస్యలు ఉత్పన్నం చేసేలా ఉన్నారన్నారు. తక్షణమే విచారణ జరిపి ఎన్నికల విధుల నుంచి ఉద్దేశపూర్వకంగా తప్పించుకునే ఉద్యోగులను సస్పెండ్ చేయాలని అధికారులను ఆదేశించారు. ఎన్నికల విధులలో  నిర్లిప్తతను ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. నిబద్ధతతో విధులు నిర్వహించాలన్నారు. ప్రతి రెండు గంటలకు ఒకసారి ఎన్నికల సరళిపై కమాండ్ కంట్రోల్ రూమ్ కి వివరాలు పంపాలన్నారు.
       
       ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద ఒక పురుష వాలంటీర్, ఒక మహిళ వాలంటీర్ లను ఏర్పాటు చేయాలని కలెక్టర్ చెప్పారు. అంగన్వాడి కార్యకర్తలు లేదా ఆయాలు పోలింగ్ కేంద్రాలకు అందుబాటులో ఉండాలన్నారు. పాఠశాలల్లో నాల్గో తరగతి ఉద్యోగులను వాలంటీర్లుగా ఏర్పాటు చేయాలన్నారు. దివ్యాంగులు, వృద్ధుల కొరకు పోలింగ్ కేంద్రాల వద్ద వీల్ చైర్స్ ఏర్పాటు చేయాలన్నారు. ఎన్నికలు ముగిసిన వెంటనే మధ్యాహ్నం రెండు గంటలకు ఓట్ల లెక్కింపు కచ్చితంగా ప్రారంభించాలన్నారు. ఓట్ల లెక్కింపు కేంద్రాలకు అదనపు విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలన్నారు. కేంద్రాల వెలుపల విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలన్నారు.
       
   గ్రామపంచాయతీ మూడో దశ ఎన్నికల ప్రక్రియకు డిస్పాచ్ సెంటర్లలో అన్ని వసతులు కల్పించాలని కలెక్టర్ సూచించారు. ఎండిఓ కార్యాలయాలలో కంట్రోల్ రూమ్, హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలన్నారు. రేపల్లె నియోజకవర్గంలోని ఆయా మండలాలకు ఎలా చేరుకోవాలి అనే అంశాలను సదరు ఉద్యోగులకు వివరించేలా ఏర్పాట్లు చేయాలన్నారు. సూక్ష్మ పరిశీలకులకు ఇన్చార్జి అధికారులను అనుసంధానించాలన్నారు. ఎన్నికల విధులు నిర్వహించే అధికారులందరికీ ఒక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేయాలన్నారు. ఎన్నికలకు సంబంధించిన మార్గదర్శకాలు, సూచనలు ఎప్పటికప్పుడు ఆ గ్రూపులో పంపాలన్నారు. ఎన్నికల మార్గదర్శకాలను అనుసరించి యంత్రాంగం పనిచేయాలన్నారు. 
          
       ఎన్టీఆర్ భరోసా పింఛన్ నగదు పంపిణీకి అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ చెప్పారు. ఎన్నికల కమిషన్ అనుమతులు మేరకు ఒకటో తేదీన పింఛన్ పంపిణీ చేయాలన్నారు. ఆయా ప్రాంతాలలో సిబ్బంది ఎన్నికల విధులలో ఉంటే మరుసటి రోజు లబ్ధిదారులకు నగదు పంపిణీ చేయాలన్నారు. ఇందు కొరకు 30వ తేదీన అన్ని ప్రాంతాలలో బ్యాంకుల నుంచి నగదు డ్రా చేయాలన్నారు. సమస్యలుంటే కంట్రోల్ రూమ్ కి సమాచారం ఇవ్వాలన్నారు.
          
         ఈ సమావేశంలో డిఆర్ఓ లవన్న, డిపిఓ నగేష్ కుమారి, బాపట్ల ఆర్డీవో హరికుమార్, డిఈవో శ్రీనివాస్ సింగ్, ఎన్నికల విభాగం పర్యవేక్షకులు షేక్ షఫీ, తదితరులు పాల్గొన్నారు.