గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తా.
చంద్రబాబుతోనే అభివృద్ధి సాధ్యం.
కూటమి ప్రభుత్వంలో గ్రామాల్లో సంక్షేమం అభివృద్ధి పరుగులు.
గొట్టిపాటి లక్ష్మి సహకారంతో గ్రామాలను అభివృద్ధి పథం లో నడిపిస్తా.
జడ్పిటిసి టిడిపి అభ్యర్థి మందలపు సౌమ్య.
సూర్య న్యూస్ ముండ్లమూరు. నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి సహకారంతో గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపిస్తానని సమస్యలు తెలుసుకుని ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తానని జడ్పిటిసి టిడిపి అభ్యర్థి మందలపు సౌమ్య అన్నారు. మండలంలోని పోలవరం గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొని సైకిల్ గుర్తుకు ఓటెయ్యాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా సౌమ్య మాట్లాడుతూ గ్రామాల్లోని సమస్యలు తెలుసుకుని ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తానని తెలిపారు. కూటమి ప్రభుత్వంలో సంక్షేమ అభివృద్ధి పరుగులు తీస్తోందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తోనే అభివృద్ధి సాధ్యమని, గత గుడ్డలు పార్టీ పాలనలో రాష్ట్రం సర్వనాశనం అయిందన్నారు. జగన్ తన సైకో వైఖరితో రాష్ట్రంలో ఎన్ని వ్యవస్థలను నాశనం చేశాడని సౌమ్య అన్నారు. ఇంటింటికి సంక్షేమం అభివృద్ధి అందిస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానిదేనన్నారు. సంక్షేమం అభివృద్ధి మరింత వేగవంతంగా జరగాలంటే సైకిల్ గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని సౌమ్య ఓటర్లను కోరారు.