BREAKING
దసరా సెలవుల జోష్.. ట్యాంక్ బండ్‌కు పోటెత్తిన పర్యాటకులు! కండ్రికలో పలగాని బాబురావు పార్కు అభివృద్ధి పనులకు శంకుస్థాపన కోనసీమ దసరా వైభవం: అమలాపురంలో అంబరాన్నంటే ఉత్సవాలు. గాయత్రీ దేవి అలంకారంలో వాసవీ అమ్మవారు పుట్టావారిపాలెం క్యాంపు కార్యాలయంలో వినతుల స్వీకరణ. ఆర్టీసీ-మెట్రో కామన్ పాస్ ఛార్జీలపై తెలంగాణ ప్రభుత్వం పునఃసమీక్ష భక్తులకు సౌకర్యవంతమైన దర్శనమే లక్ష్యం సమాచార హక్కు చట్టం దరఖాస్తులకు గడువులోగా సమాధానాలివ్వాలి ప్రభుత్వ శాఖల అధికారులకు డీఆర్ఓ ఏ. మలోల ఆదేశం సింగరకొండలో వైభవంగా లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణ మహోత్సవం. బొల్లారంలో దారుణం: ఐదేళ్ల చిన్నారి అపహరణ, హత్య కేసును ఛేదించిన పోలీసులు! డబిల్‌పూర్ చెరువు కట్టపై రోడ్డు ప్రమాదం.. బొలెరో ఢీకొని నాగులూరి సురేష్ మృతి నియోజకవర్గ జనసేన సమన్వయకర్తలు ముగ్గురు. నాణ్యతలేని ఇన్సులేటర్లు- పొంచి ఉన్న ప్రాణగండం బంట్వారం మోడల్ స్కూల్లో స్పెషల్ ఎడ్యుకేటర్ పోస్టు సంతానానికి భారం కావద్దని తండ్రి ఆత్మహత్య...

గ్రామ అభివృద్ధే నా ధ్యేయం,

Select Suryaa Now
గ్రామ అభివృద్ధే నా ధ్యేయం,

అభివృద్ధి కార్యక్రమాలకు సొంత నిధులు వెచ్చిస్తా, 

ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్ర ప్రకటించిన అభ్యర్థుల గెలిపి లక్ష్యంగా పనిచేస్తా,

కార్యకర్తలతో సమీక్షా సమావేశం నిర్వహించిన దారపనేని 

పామూరు, మేజర్ న్యూస్ : 

తన సొంత గ్రామమైన తూర్పు కోడిగుడ్లపాడు పంచాయతీ అభివృద్ధే ధ్యేయంగా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు కనిగిరి మాజీ ఏఎంసీ చైర్మన్ దారపనేని చంద్రశేఖర్ అన్నారు. పామూరు మండలం తూర్పు కోడిగుడ్లపాడు గ్రామపంచాయతీ పరిధిలోని బీసీ కాలనీ (ఇరిగినేని నగర్) లో బిసి, ఎస్సీ, ఎస్టీ స్థానికులతో సమీక్ష సమావేశాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా దారపనేని మాట్లాడుతూ గత 5 సంవత్సరాల కాలంలో గ్రామభివృద్ధి కుంటుపడిందని అసంపూర్తిగా నిలిచిపోయిన పనులను తన సొంత నిధులతో నిర్మాణ పనులు చేపట్టడమే లక్ష్యంగా పనిచేస్తానని ప్రకటించారు. ఇందులో భాగంగా స్థానిక బీసీ కాలనీలోని రామాలయం అభివృద్ధి, చౌడమ్మ, పెద్దమ్మ తల్లి గ్రామ దేవతల దేవస్థానాల అభివృద్ధి, జంగాలపల్లి గ్రామంలో గంగమ్మ దేవస్థానం అభివృద్ధి, అదేవిధంగా స్థానిక ఎస్సీ కాలనీలోని ప్రార్థనా మందిరం అభివృద్ధితో పాటు ఎస్సి స్మశాన వాటిక వద్ద షెడ్డు నిర్మాణం నీటి వసతి కోసం బోరును ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. పోతవరం స్మశాన వాటిక కు రహదారి నిర్మాణం కొరకు స్థానిక రైతులతో చర్చించారు. స్థానిక సంస్థల ఎన్నికలలో ఒంగోలు పార్లమెంటు టిడిపి అధ్యక్షులు కనిగిరి శాసనసభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ప్రకటించిన అభ్యర్థుల విజయమే లక్ష్యంగా మనమందరం కలిసికట్టుగా పనిచేసి జెడ్పిటిసి, తూర్పు కోడిగుడ్లపాడు ఎంపీటీసీ, తూర్పు కోడిగుడ్లపాడు సర్పంచ్ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అద్దంకి బాల నాగయ్య, కోటయ్య, మాల్యాద్రి, రామయ్య, చెనికల చినమాల కొండయ్య అండ్ బ్రదర్స్, పుల్లయ్య, జంగిటి నాగయ్య, చల్ల కొలుసు నాగయ్య, బిస్కెట్, ధనియాల తిరుపతయ్య, మానం నాగేశ్వరరావు, కిరణ్, బాజీ యాదవ్, వెంగళరావు, చెనికల మల్లికార్జున, తాళ్లూరి పాములయ్య బ్రదర్స్, తాతపూడి నరసయ్య అండ్ బ్రదర్స్, బండారు ప్రసాద్, అండ్ సన్స్, ఏసు పోగు నాగేష్, తాళ్లూరి రాజకుమార్ అండ్ బ్రదర్స్, తాళ్లూరి కృపయ్య అండ్ సన్స్, డానియాలు, జయరావు, సవరం అంకయ్య, లక్ష్మయ్య, వెంగళరావు, దండే వెంకటేశ్వర్లు, మాదర పాకం, దండే వెంకటేశ్వర్లు (రియల్టర్) దండే తిరుపతయ్య, దేవరకొండ చెన్నకేశవులు, బాలయ్య, దేవరకొండ సుబ్బమ్మ, అంకయ్య, చెన్న కృష్ణయ్య, చెన్నకేశవులు, ఆదిలక్ష్మమ్మ, వెంగమ్మ, ఇర్ల రాజు, రమేష్, వెంకటేష్, జంగమయ్య, బండారు వెంగయ్య, మీడియం సుబ్బరాయుడు, దారపనేని రాజేంద్రప్రసాద్, తిరివీధి చంద్ర, కల్లూరి సురేష్, తిరివీధి ముకుందరావు, ఆరే తిరుపాలు, గడ్డం తిరుపతిరావు, పెండ్యాల శ్రీనివాసులు, తదితరులు భారీ సంఖ్యలో సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు.