ఘనంగా వైఎస్సార్‌సీపీ నూతన బీసీ, మైనారిటీ నేతల సన్మానం: పార్టీ పటిష్టతకు కృషి చేయాలని బొంతు సత్య శ్రీనివాస్ పిలుపు!
ముమ్మిడివరం మేజర్ న్యూస్ :సూర్య డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా & ముమ్మిడివరం డెస్క్: స్థానిక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ముమ్మిడివరం టౌన్ ప్రెసిడెంట్ బొంతు సత్య శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆత్మీయ సన్మాన సభ ఘనంగా జరిగింది. ముమ్మిడివరం రూరల్, అర్బన్ పరిధిలో పార్టీ రాష్ట్ర మరియు జిల్లా స్థాయి నూతన పదవులు దక్కించుకున్న బీసీ, మైనారిటీ నాయకులను ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు ఘనంగా సత్కరించాయి.
రాష్ట్ర స్థాయి పదవులు పొందిన రాష్ట్ర లీగల్ సెల్ సెక్రెటరీ కోన వెంకట శ్రీనివాసరావు, రాష్ట్ర పబ్లిసిటీ జనరల్ సెక్రెటరీ రెడ్డి సతీష్, రాష్ట్ర పంచాయతీరాజ్ వింగ్ జాయింట్ సెక్రెటరీ కుడిపూడి శంకర్రావు, రాష్ట్ర బీసీ సెల్ జనరల్ సెక్రెటరీ సానబోయిన మల్లికార్జున రావులను నేతలు ప్రత్యేకంగా అభినందించారు.
అలాగే జిల్లా కల్చరల్ వింగ్ వైస్ ప్రెసిడెంట్ మాత్ర వీర్రాజు, జిల్లా పంచాయతీ రాజ్ సెక్రెటరీ మట్టపర్తి సురేష్, జిల్లా మున్సిపాలిటీ వింగ్ సెక్రెటరీ కొప్పిశెట్టి బాలకృష్ణ, జిల్లా మైనారిటీ సెల్ జనరల్ సెక్రెటరీ మీర్జా ఆలీ హసన్, జిల్లా వైఎస్సార్‌టీయూసీ సెక్రెటరీ గుత్తుల మల్లికార్జున రావు, జిల్లా ఇంటలెక్చువల్ వింగ్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ కుడుపూడి హరికృష్ణ, నియోజకవర్గ బీసీ సెల్ ప్రెసిడెంట్ మట్టపర్తి శివరాంబాబులను పూలమాలలు, శాలువాలతో ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ.. పార్టీకి అంకితభావంతో పనిచేసిన కార్యకర్తలు, నాయకులకు వైఎస్సార్‌సీపీలో సముచిత స్థానం లభిస్తుందని పేర్కొన్నారు. నూతనంగా నియమితులైన నాయకులు పార్టీ బలోపేతానికి, ప్రజా సమస్యల పరిష్కారానికి మరింత చురుగ్గా కృషి చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక వైఎస్సార్‌సీపీ ప్రజాప్రతినిధులు, మండల, పట్టణ స్థాయి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.