BREAKING
ఆర్టీసీ బస్టాండ్ ను ఆకస్మికంగా సందర్శించి జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి కుర్ని దైవాచార సంఘం ప్రతినిధికి బుట్టా పరామర్శ ఉట్కూరు గురుకుల పాఠశాల తనిఖీ చేసిన కలెక్టర్ అడ్డుకునేందుకు వైసీపీ కుట్రలు: చంద్రబాబు ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన పెంచుకోవాలి ముగిసిన స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా స్థాయి పోటీలు రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం - ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ కొందుర్గు గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కాడిగల్ల మహేందర్ కొత్తచెరువు సమస్యను పరిష్కరించాలని ఎమ్మార్వో కు వినతి రూ.1,789.52 కోట్లతో ఐటీఎంఎస్‌.. 42 ప్రధాన ట్రాఫిక్‌ కారిడార్లలో అమలు హరిహరులను విభజించే హక్కు ఎవరిచ్చారు కరీంనగర్‌లో నూతన కలెక్టరేట్ ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాఫీ విత్ కరణ్ షోకు తెరదించిన కరణ్ జోహార్.. సెలెబ్రిటీ కెరీర్‌లను ముగించిన ఐకానిక్ టాక్ షో ముగింపు బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం ఎం.ఎం.హళ్లిలో రేపు మంత్రి పయ్యావుల కేశవ్ పర్యటన

ఘనంగా అంగన్వాడి ఉత్సవాలు

Select Suryaa Now
 ఘనంగా అంగన్వాడి ఉత్సవాలు

ఘనంగా 'అంగన్‌వాడీ ఉత్సవాలు'

​పౌష్టికాహార పథకాలపై తల్లులకు విస్తృత అవగాహన

పులివెందుల మేజర్ న్యూస్:

​స్థానిక శ్రీరామహాల్ రోడ్డు 2
అంగన్‌వాడీ కేంద్రంలో 'అంగన్‌వాడీ ఉత్సవాలు' ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ఐసీడీఎస్ సూపర్‌వైజర్ బి.రాజ్యలక్ష్మి ముఖ్య అతిథిగా హాజరై,సచివాలయ,ఆరోగ్య సిబ్బందితో కలిసి ప్రభుత్వ పథకాలపై తల్లులకు అవగాహన కల్పించారు.​ఈ సందర్భంగా సూపర్‌వైజర్ మాట్లాడుతూ ప్రభుత్వం గర్భిణులు,బాలింతలకు నెలకు బియ్యం,రాగిపిండి,పప్పు,నూనె,పాలు,గుడ్లు,చిక్కీలతో కూడిన పోషకాహారాన్ని ప్రతినెలా రెండు విడతల్లో ఇంటికే అందజేస్తున్నట్లు తెలిపారు.7 నెలల నుంచి 3 ఏళ్ల చిన్నారులకు బాలామృతం,గుడ్లు,పాలు పంపిణీ చేస్తున్నామని,3 నుండి 6 ఏళ్ల పిల్లలకు ప్రీ-స్కూల్ విద్యతో పాటు రోజూ గుడ్డు,పాలు,వేడి భోజనం అందిస్తున్నట్లు పేర్కొన్నారు.​పిల్లల ఎత్తు,బరువులను పరిశీలించి పోషకాహార లోపం ఉంటే 'నవచేతన' యాప్ ద్వారా ఆస్పత్రులకు రెఫర్ చేస్తున్నామని వెల్లడించారు.పీఎంఎంవీవై కింద అర్హులైన తల్లులకు రూ. 5,000/- నుండి రూ. 6,000/- వరకు ఆర్థిక సాయం అందుతుందని తెలిపారు.
అనంతరం కేంద్రంలోని ఇండక్షన్ స్టవ్,సామగ్రిని పరిశీలించి, తల్లులందరూ ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు కార్యక్రమంలో అంగన్‌వాడీ కార్యకర్తలు, బాల పరిమళ ఆయా విజయలక్ష్మి  ఏఎన్ఎం రజియా తదితరులు పాల్గొన్నారు.