ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన పెంచుకోవాలి
ప్రతి ఒక్కరు చట్టాలపై అవగాహన పెంచుకోవాలి
నాగర్ కర్నూల్ క్రైమ్ సూర్య న్యూస్ : ప్రతి ఒక్కరు చట్టాలపై అవగాహన పెంచుకున్నప్పుడే సరైన న్యాయం పొందవచ్చని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ నిహారిక అన్నారు. జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో బుధవారం తాడూరు మండలంలోని లచ్చిరాం తాండ గ్రామ పంచాయతీ కార్యాలయం లో ట్రైబల్ రైట్స్ గురించి న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించడం జరిగింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ హాజరై మాట్లాడుతూ ప్రతి ఒక్కరు చట్టాల పట్ల కనీస అవగాహన కలిగి ఉండాలి అన్నారు. ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండడం వల్ల సమాజంలో నేరాలు జరగకుండా అరికట్టవచ్చు అన్నారు. గిరిజన హక్కుల గురించి, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అందిస్తున్న సేవల గురించి వివరించారు. ఎవరైనా న్యాయ వాదిని పెట్టుకునే స్తోమత లేని వారికి సంస్థ తరుపున ఉచితంగా న్యాయవాదిని నియమిమని అన్నారు. గిరిజనులు తమ హక్కుల ను ఉపయోగించుకొని జీవితంలో గొప్ప స్థాయికి చేరుకోవాలి అన్నారు.