వృద్ధాప్యాన్ని గౌరవిద్దాంపై అవగాహన
అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవాన్ని పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలోని మహిళ అధ్యయన ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ మేరకు గురువారం దామినిడిలోని సర్వోదయ వృద్ధాశ్రమంలో వృద్ధప్యాన్ని గౌరవిద్దాం అనే అంశంపై వృద్ధులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అసిస్టెంట్ ప్రొఫెసర్ డా.కె.రాణి హాజరై మాట్లాడుతూ ఈ ఏడాది థీమ్ "దీర్ఘకాలిక జీవనానికి అనుగుణంగా ఆరోగ్యం, సామాజిక భద్రత, సంరక్షణ వ్యవస్థలను పునర్నిర్మించడం" అని తెలిపారు. వృద్ధులు ఒంటరి భావన లేకుండా స్నేహభావంతో, ఒకరినొకరు అర్థం చేసుకుంటూ, మానసికంగా ధైర్యంగా, చిన్నపాటి వ్యాయామాలతో ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఆత్మవిశ్వాసంతో జీవించాలని సూచించారు.ముఖ్య అతిథి అసోసియేట్ ప్రొఫెసర్ డా.డి.ఉమాదేవి వృద్ధుల హక్కుల గురించి-పోషణ, సంరక్షణ హక్కు, ఆస్తి రద్దు, వృద్ధాశ్రమాలు, వైద్య సౌకర్యాల గురించి వివరించారు. కార్యక్రమంలో ప్రాజెక్ట్ అసిస్టెంట్ వి. ప్రీతి, వృద్ధాశ్రమ నిర్వాహకుడు మాధవ, వృద్ధులు పాల్గొన్నారు.
సీఎం గౌడ్ తిరుపతి ప్రతినిధి