BREAKING
స్వచ్ఛతలో సత్తా చాటిన మాచవరం పంచాయితీ స్వచ్ఛతలో కోనసీమకు 67 స్వచ్ఛాంధ్ర అవార్డులు..ఎంపీ గంటి హరీష్ మాధుర్ బాలయోగి,... మహిక ఆసుపత్రిలో ఎన్టీఆర్ వైద్య సేవలు ప్రారంభం.. కారెం శివాజీని పరామర్శించిన మందకృష్ణ మాదిగ.... నేటి పంచాంగం — 3 అక్టోబర్ 2026, శనివారం నేటి రాశి ఫలాలు: 3 అక్టోబర్ 2026, శనివారం.. ఆసియా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర టెక్ ప్రపంచంలో సరికొత్త చర్చ గ్రామ సభలో నిధుల లేక్కెంటీ..? అంగన్వాడీలకు రూ.26 వేల వేతనం ఇవ్వాలి గాంధీ జయంతి రోజున ముంబైలో సీజేపీ నిరసన: జ్ఞానేష్ కుమార్ రాజీనామా డిమాండ్‌తో రోడ్లపైకి జనం, పోలీసుల అనుమతి నిరాకరణ మధ్య ఉద్రిక్తత బీసీలకు 34 శాతం రిజర్వేషన్లపై చంద్రబాబు చెప్పేవి అబద్ధాలు: రాజమహేంద్రవరంలో చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ సవాల్, 100 సీట్ల హామీపై నిలదీత చీనాబ్ - అంజీ బ్రిడ్జిలపై తొలిసారి గంటకు 100 కి.మీ. వేగంతో వందే భారత్ రోజూ కాఫీ తాగుతున్నారా... లివర్‌పై దాని ప్రభావం ఇదే! పండ్లు ఏ సమయంలో తింటే ఆరోగ్యానికి మంచిది? ఉదయం, మధ్యాహ్నం, రాత్రి వేళల్లో తినడంపై నిపుణుల సలహాలు!

రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావంపై కేబినెట్‌ సుదీర్ఘ చర్చ.. అఖిలపక్ష సమావేశానికి సీఎం రేవంత్ ఆదేశం

Select Suryaa Now
రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావంపై కేబినెట్‌ సుదీర్ఘ చర్చ.. అఖిలపక్ష సమావేశానికి సీఎం రేవంత్ ఆదేశం

హైదరాబాద్:, సూర్య ప్రతినిధి :తెలంగాణలో ఎల్‌నినో ప్రభావంతో తలెత్తిన తీవ్ర వర్షాభావ పరిస్థితులు, కరువు సంక్షోభంపై రాష్ట్ర మంత్రిమండలి సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 235 మండలాల్లో వర్షపాతం గణనీయంగా తగ్గి తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నాయని అధికారులు కేబినెట్‌కు వివరించారు.

ఈ పరిస్థితుల దృష్ట్యా రైతాంగాన్ని, ప్రజలను ఆదుకునేందుకు తక్షణమే చేపట్టాల్సిన సహాయక చర్యలపై లోతుగా చర్చించేందుకు కేబినెట్‌ సబ్‌ కమిటీ సమావేశం కావాలని మంత్రిమండలి నిర్ణయించింది. తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చూడటం, పంట నష్టపోయిన రైతులకు ఊరట కలిగించడం, ప్రత్యామ్నాయ ప్రణాళికల రూపకల్పనపై సబ్‌ కమిటీ ప్రణాళికలు సిద్ధం చేయనుంది.

కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు రాజకీయాలకు అతీతంగా అందరి అభిప్రాయాలు సేకరించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా, త్వరలోనే అన్ని రాజకీయ పార్టీలతో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ భేటీలో ప్రజాప్రతినిధులు, నిపుణుల సూచనలు తీసుకుని సమగ్ర కరువు ఉపశమన చర్యలు చేపట్టనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.