బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం
సూర్య కమ్మర్పల్లి , కమ్మర్ పల్లి మండలంలోని కోనాపూర్ ఇటీవల గల్ఫ్ దేశంలో గుండెపోటుతో మృతి చెందిన కోనాపూర్ గ్రామానికి చెందిన పొన్నం హరీష్ గౌడ్ కుటుంబాన్ని ఆదుకునేందుకు హెల్పింగ్ హ్యాండ్ – కోనాపూర్ ఆధ్వర్యంలో రూ.55,150 ఆర్థిక సహాయాన్ని అందజేశారు.
ఈ మొత్తాన్ని మృతుడు హరీష్ గౌడ్ భార్య మరియు కుమారుడికి అందజేసి, కుటుంబానికి అండగా నిలిచారు. ఆపద సమయంలో కుటుంబానికి సహాయం చేయడం ద్వారా మానవత్వాన్ని చాటుకున్న హెల్పింగ్ హ్యాండ్ సభ్యులను పలువురు అభినందించారు.
హెల్పింగ్ హ్యాండ్‌ను ఏర్పాటు చేసినప్పటి నుంచి గత ఆరు సంవత్సరాలుగా ఆపదలో ఉన్న కుటుంబాలను ఆదుకుంటూ ఇప్పటివరకు మొత్తం ఏడు కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించినట్లు నిర్వాహకులు తెలిపారు. భవిష్యత్తులో కూడా అవసరమైన కుటుంబాలకు తమ వంతు సహాయాన్ని అందిస్తామని వారు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో అంజయ్య, సంజీవ్, లక్ష్మీనారాయణ, రమేష్, గంగాధర్, రాజు, రాజేష్, ఎల్లయ్య, నాగేశం,రాజ గంగారం తదితరులు పాల్గొన్నారు.