BREAKING
జిల్లాలో పర్యాటక రంగ అభివృద్ధిపై ప్రత్యేక చర్యలు - జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) యువరాజ్ మర్మాట్ పోగొట్టుకున్న పర్సు ను 24 గంటల లోపే బాధితుడికి అప్పగించిన రామకృష్ణాపూర్ పోలీసులు. స్వచ్ఛతలో భాగస్వాములుకండి.. -సర్పంచ్ కవిత నర్సింగ్ విద్యార్థిని ఆత్మ హత్య.. ప్రతి నెల మొదటి రోజే అవ్వాతాతల ఇంటి వద్దకు పింఛన్ విజయలక్ష్మీ గునుకుల-జనసేన జిల్లాలో భూ భారతి రీ-సర్వే ప్రక్రియను పారదర్శకంగా, ఖచ్చితత్వంతో, ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా నిర్వహించాలి. జిల్లా కలెక్టర్ కె. హైమావతి అధికారులను ఆదేశించారు. జిల్లాస్థాయి వాకృత్వ పోటీల్లో మండపేట విద్యార్థులు ప్రతిభ ఎట్టకేలకు రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న సుడిగాలి సుధీర్ గోట్ మూవీ గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే ని కలిసిన పాండురంగ రిజర్వాయర్ ముంపు బాధితులు వృద్ధాప్యాన్ని గౌరవిద్దాంపై అవగాహన పేదల జీవితాల్లో ఆనందం నింపుతున్నకూటమి ప్రభుత్వ లక్ష్యం నిజాంపేటలో ఉచిత మెగా వైద్య శిబిరం రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావంపై కేబినెట్‌ సుదీర్ఘ చర్చ.. అఖిలపక్ష సమావేశానికి సీఎం రేవంత్ ఆదేశం మానవతా స్ఫూర్తితో రక్తదానం రాష్ట్ర స్థాయి కుంగ్- ఫూ కరాటే లో ప్రతిభ కనబరిచిన విద్యార్థినీయులు

కొత్తచెరువు సమస్యను పరిష్కరించాలని ఎమ్మార్వో కు వినతి

Select Suryaa Now
కొత్తచెరువు సమస్యను పరిష్కరించాలని ఎమ్మార్వో కు వినతి

బిక్కనూర్ :మండలంలోని బాగిర్తి పల్లి గ్రామ శివారులో ఉన్న, కొత్తచెరువు సమస్యను పరిష్కరించాలని, కోరుతూ బుధవారం గ్రామ సర్పంచ్ గంగయ్యగారి నర్సింలు ఆధ్వర్యంలో, అఖిలపక్ష నాయకులు ఎమ్మార్వో సునీత దేవికి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటీవల ఇసన్నపల్లి గ్రామస్తులు వినాయక నిమజ్జనం సందర్భంగా, గ్రామస్తులతో గొడవకు దిగారని, వినాయక నిమజ్జనం కోసం ఇసన్నపల్లి గ్రామస్తులను తమ గ్రామస్తులు అడ్డుకోలేదని, గత 40 సంవత్సరాలుగా కొత్తచెరువు నుండి ముదిరాజ్ కులస్తులకు చెరువు పై హక్కు ఉందని, మత్స్యకార సొసైటీ తమ గ్రామంలోనే ఉందని, వెంటనే రెండు గ్రామాలకు ఇబ్బందులు లేకుండా కొత్తచెరువుకు సర్వే నిర్వహించి తమకు న్యాయం చేయాలని వినతిపత్రంలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మార్వో మాట్లాడుతూ సమస్యను త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు