ధర్మవరం 42వ వార్డులో ఉచిత సామాజిక వైద్య శిబిరం
అనంతపురం బ్యూరో: పట్టణంలోని 42వ వార్డు రాజేంద్రనగర్‌లో గొడుగు చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో ఉచిత సామాజిక వైద్య శిబిరాన్ని నిర్వహించారు. టీడీపీ ముస్లిం మైనార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగూర్ హుస్సేన్, 42వ వార్డు ఇన్‌చార్జ్ ముత్తుకూరు బీబీ ఆధ్వర్యంలో ఈ శిబిరం జరిగింది.
ఈ వైద్య శిబిరంలో 100 మందికి పైగా ప్రజలకు మోకాళ్లు, కీళ్ల నొప్పులతో పాటు బీపీ, షుగర్ పరీక్షలు నిర్వహించారు. వయోవృద్ధులకు ఫిజియోథెరపీ సేవలు అందించడంతో పాటు, ఫిజియోథెరపీ పరికరాల ద్వారా ఐఎఫ్‌టీ చికిత్స అందించారు. అవసరమైన వారికి టాబ్లెట్లు, మందులను ఉచితంగా పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో శిబిరాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ముఖ్యంగా వయోవృద్ధులు, ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి ఉచిత వైద్య పరీక్షలు, చికిత్స అందించడం ద్వారా వారికి కొంతమేర ఉపశమనం కల్పించినట్లు పేర్కొన్నారు.
కార్యక్రమంలో గొడుగు నాగరాజు, తెలుగుదేశం పార్టీ విభిన్న ప్రతిభావంతుల శ్రీ సత్యసాయి జిల్లా అధ్యక్షులు నాగూర్ ఉమర్ (స్టాలిన్), అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ నాగేంద్ర ప్రసాద్, డాక్టర్ సురేందర్, ఆశా వర్కర్లు అరుణ, పద్మజతో పాటు 42వ వార్డు ప్రజలు, తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.