BREAKING
ఎల్టీ లైన్ తగిలి ఎద్దు మృతి కేంద్ర ఎన్నికల అధికారి జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధి మద్దాల ప్రసాద్ డిమాండ్ చేశారు తెలుగు ఇండస్ట్రీ నాకు తల్లిలాంటిది.. యాంకర్ సుమ కనకాల ఎమోషనల్ పోస్ట్ వైరల్ పోషణ్ అభియాన్ పై అవగాహన కార్యక్రమం హక్కులతో పాటు బాధ్యతలను గుర్తుంచుకోవాలి పారిశుద్ధ్య కార్మికులకు వైద్య పరీక్షలు వైద్యం అందలేదని తల్లిని వీల్‌చైర్‌లో ఎమ్మెల్యే ఇంటికి తీసుకెళ్లిన కుమారుడు! నెల్లూరు కార్పొరేషన్‌లో ఎక్కడిక్కడ దోపిడి అర్హులైన అందరికి రేషన్‌, పౌష్టికాహారం అందేలా చర్యలు - రాష్ట్ర ఫుడ్‌ కమిషన్‌ చైర్మన్‌ గోలి శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా కలెక్టర్‌ రాజర్షి షా పదవీ విరమణ పొందిన వారికి కాట సుధా శ్రీనివాస్ గౌడ్ ఆత్మీయ సన్మానం సూర్య కథనానికి స్పందించిన వైద్యశాఖ - శ్రీరాంపూర్‌ గూడ లో ప్రత్యేక వైద్య శిబిరం చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ను వెంటనే తొలగించాలి భూ రీ సర్వేను సకాలంలో పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్ సయ్యద్ చాంద్‌కు సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేసిన ఆత్రం సుగుణక్క విమానంలో తీవ్ర కలకలం.. 15 వేల అడుగులకు పడిపోయిన విమానం

కొందుర్గు గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కాడిగల్ల మహేందర్

Select Suryaa Now
కొందుర్గు గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కాడిగల్ల మహేందర్

కొందుర్గు గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కాడిగల్ల మహేందర్ ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు. బుధవారం కొందుర్గ్ మండల కేంద్రంలో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు కే పురుషోత్తం రెడ్డి ఆధ్వర్యంలో ఎన్నిక ప్రక్రియను నిర్వహించారు. కొందుర్గ్ గ్రామ కమిటీతో పాటు ఓబీసీ సెల్ గ్రామ అధ్యక్షుడిగా రామకృష్ణ గౌడ్, ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా కె. పద్మయ్య, మైనారిటీ సెల్ అధ్యక్షుడిగా అజమత్ లు ఎన్నిక అయ్యారు.ఈ సందర్భంగా 
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ హాజరై నూతన అధ్యక్షులకు నియామక పత్రాలు అందజేశారు. అనంతరం వారిని సన్మానించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కోసం అహర్నిశలు శ్రమిస్తున్న కార్యకర్తలకు తప్ప కుండా గుర్తింపు లభిస్తుందని, ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. పార్టీ శ్రేణులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తన వంతు కృషి చేస్తానని తెలిపారు. ప్రజా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పలువురు బీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు పార్టీ నాయకులు తెలిపారు.
కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షుడు కృష్ణారెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ అనిత జితేందర్ రెడ్డి, దామోదర్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సయ్యద్ సాదిక్, మల్లేష్ గౌడ్, రాములు గౌడ్, డీసీసీ కార్యదర్శులు గోవర్ధన్ గౌడ్, అంజిరెడ్డి, జీబీ కృష్ణ,  ఫాయిం, కావలి యాదయ్య, పెంటయ్య, బోరేగా నరేందర్, దుర్గని శ్రీను, నర్సింలు, , బొరిగే యాదయ్య, గోపాల్,బి మానయ్య, జి ప్రసాద్, సి కృష్ణయ్య, సీర్ప మల్లయ్య, జిల్లెల ప్రవీణ్, వేణు,కావాలి లక్ష్మయ్య, నరేందర్ గౌడ్, వెంకటేష్, రామస్వామి, అమర్, శ్రీనివాసరెడ్డి, బొట్టు శ్రీను, రాజేందర్, చిన్నరాజ్ తదితరలు పాల్గొన్నారు.

E. సత్యనారాయణ, కొందుర్గు మేజర్ న్యూస్....