కేంద్ర ఎన్నికల అధికారి జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధి మద్దాల ప్రసాద్ డిమాండ్ చేశారు
జంగారెడ్డి గూడెం మేజర్ న్యూస్: ఓట్ల సమగ్ర సర్యే SIRలో జరిగిన అవకతవకలపై ప్రధాన ఎన్నికల అధికారి జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని దేశవ్యాప్త ఆందోళనలో భాగంగా జంగారెడ్డిగూడెం తాసిల్దార్ కార్యాలయం ముందు సి పి ఐ.సిపిఎం . సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ . కాంగ్రెస్ పార్టీల ఆధ్వర్యంలో ధర్నా జరిగింది ధర్నాని ఉద్దేశించి కాంగ్రెస్ పార్టీ నాయకులు మద్దాల ప్రసాద్ సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు కెవి రమణ సిపిఎం నాయకులు పసల సూర్యారావు సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు జి బాల యేసు లు మాట్లాడుతూ భారత ఎన్నికల సమగ్ర జాతీయ సర్వేలో అనేక అవకతవకలు జరుగుతున్నాయని కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రతిపక్ష పార్టీలు గతం నుండే అనేక సాక్ష్యాలతో కేంద్రాన్ని నిలదీసినప్పటికీ ఎన్నికల ప్రధాన అధికారిని తన గుప్పెట్లో పెట్టుకుని కేంద్రం ప్రతిపక్ష పార్టీల ఓట్లను లేకుండా చేస్తున్నదని ఆరోపించారు ఇటీవల దేశంలో ప్రధాన పత్రిక అయిన ఇండియన్ ఎక్స్ప్రెస్ గత పది నెలలలో ఎన్నికల సంఘం లో ఉన్న ముగ్గురిలో ఇద్దరు సభ్యులు ప్రధాన ఎన్నికల కమిషనర్ కు వ్యతిరేకంగా 14 సార్లు అభ్యంతరాలు పెట్టినప్పటికీ వారిని పక్కకు పెట్టి ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ కేంద్రంతో కుమ్మక్కయి దళితులు ముస్లింలు క్రిస్టియన్లు ఇతర పేద వర్గాల వారు అధికంగా ఉండే ఓట్లను తొలగించి వేస్తూ దేశంలో ఇప్పటికే 13 కోట్లకు పైగా ఓట్లను తొలగించారని ఇటీవల కాలంలో జరిగిన ఎన్నికలలో బిజెపి గెలవడానికి ఈ ప్రక్రియ వారికి బాగా ఉపయోగపడిందని విమర్శించారు భారత పౌరుడికి ఓటు హక్కు తొలగించే దుర్మార్గ విధానానికి ఎన్నికల కమిషనర్ విధానం తోర్పడ్డాయని వెంటనే ప్రధాన ఎన్నికల అధికా జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని ఆయన మీద కేసు పెట్టి విచారణ జరిపించి శిక్షించాలని డిమాండ్ చేశారు అనంతరం తాసిల్దార్ కార్యాలయం ఏవో ఉదయ గారికి వినతిపత్రం ఇవ్వడమైనది ఈ కార్యక్రమంలో సి పి ఐ మండల నాయకులు జంపన వెంకట రమణరాజు సుంకర రాధాకృష్ణ దోంతు రామ్ పండు కలపాల రాంబాబు పి వో డబ్ల్యు నాయకులు కే రామలక్ష్మి పి డి ఎస్ యు జిల్లా ప్రధాన కార్యదర్శి బన్నె వినోద్ ఐ ఎఫ్ టి యు నాయకులు యాదాల వెంకటేశ్వరరావు సి పి ఎమ్ నాయకులు వజ్ర కిరణ్ డి వై యఫ్ నాయకులు షెక్ మాబూ సుబాని వంగా గోపి జోడి సూర్య చంద్రం నరెడ్ల నాగేశ్వరరావు పి విర్రాజు వంశీ తదితరులు ఉన్నారు.
కెవి రమణ రావు జంగారెడ్డిగూడెం