BREAKING
స్వచ్ఛత, పారిశుద్ధ్య నిర్వహణలో విజయనగరం జిల్లాకు రాష్ట్రస్థాయి గుర్తింపు గాంధీజీకి విఘ్నేశ్వర, అధికారులు నివాళులు ఔత్సాహిక క్రీడాకారులను ప్రోత్సహిస్తాం : పద్మారావు గౌడ్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు బీజేపీ సమర సన్నద్ధం ఎస్.భూర్జవలస హెచ్ఎం కెవి సత్తిబాబుకు స్వచ్ఛత అవార్డు ప్రగతిశీల తల్లిదండ్రుల సంఘం (పి పి ఎల్)జిల్లా అధ్యక్షుడిగా ఉప్పలయ్య* విజయ కాలనీ అంగన్వాడీ కేంద్రానికి స్వచ్ఛ్ ఆంధ్ర అవార్డు చుండూరి నీ స్థాయేంటే....? జాతిపిత గాంధీజీ జయంతి అన్ని ప్రభుత్వ కార్యాలయాలు విద్యాసంస్థలు వైద్యాలయాలలో చేయరా ? కంచనపల్లి కాంగ్రెస్ గ్రామ శాఖ నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక రామచంద్రపురం సబ్ జైలు తనిఖీ స్వచ్ఛ ఆంధ్రలో కమలాపురం ఆసుపత్రికి ప్రథమ స్థానం డాక్టర్ ఆమంచి శిరీషకు - కలెక్టర్ చేతుల మీదుగా అవార్డు.. నడకతోనే సంపూర్ణ ఆరోగ్యం… ఎమ్మెల్యే బొలిశెట్టి హార్టికల్చర్ హబ్ ద్వారా రైతులు కు ఎంతో ఉపయోగకరం శిథిలావస్థకు చేరిన సిసి రోడ్లు

గర్భిణీలు,బాలింతలు ఐవిఆర్ఎస్ వైద్య సేవలు పొందండి:ఐసిడిఎస్ సూపర్వైజర్ బి విజయలక్ష్మి

Select Suryaa Now
గర్భిణీలు,బాలింతలు ఐవిఆర్ఎస్ వైద్య సేవలు పొందండి:ఐసిడిఎస్ సూపర్వైజర్ బి విజయలక్ష్మి

ముదినేపల్లి , మేజర్ న్యూస్ : మహిళా శిశు సంక్షేమానికి స్త్రీశిశు సంక్షేమ శాఖ ఐవిఆర్ఎస్ కాల్స్ ద్వారా అందించే వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఐసిడిఎస్ కొత్తపల్లి సెక్టర్ సూపర్వైజర్ బి విజయలక్ష్మి కోరారు. ముదినేపల్లి మండలంలో వాడవల్లి , వైవాక అంగన్వాడి కేంద్రాలలో ఐసిడిఎస్ అంగన్వాడి ఉత్సవాల్లో భాగంగా సేవా సంకల్పం అభియాన్ ర్యాలీని నిర్వహించారు. సంక్షేమం , ఆరోగ్యం , పోషకాహారం , శారీరక , మానసిక వికాసం తదితర అంశాలకు సంబంధించి ఐవీఆర్ఎస్ ద్వారా అందించే సేవలను గర్భవతులు , బాలింతలు , స్త్రీలు , స్కూలు పిల్లల తల్లిదండ్రులకు ఆమె వివరించారు. పోషక ఆహారంపై అవగాహన పెంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వాడవల్లి , వైవాక అంగన్వాడి కార్యకర్తలు సొంగ మణి , కె కృష్ణకుమారి , సిహెచ్ నిరూష , జి రోజారాణి , కె చిన్నారి , జి సువర్చల , ఎన్ రత్నకుమారి , అంగనవాడి సహాయకులు , గర్భిణీలు , బాలింతలు , మహిళలు పాల్గొన్నారు.

 రిపోర్టర్గ:-రాజు ముదినేపల్లి