ముగిసిన స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా స్థాయి పోటీలు
నారాయణపేట, సూర్యన్యూస్:
నారాయణపేట జిల్లా కేంద్రంలోని మినీ స్టేడియంలో గత మూడు రోజులుగా 70 వ పాఠశాల క్రీడా సమైక్య పోటీలు ఘనంగా ముగిసాయి. నేడు మూడవ రోజు నారాయణపేట క్రీడ మైదానంలో కబడ్డీ పోటీలను ఇంచార్జి జిల్లా యువజన క్రీడా అధికారి వెంకటేష్,జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి లు హాజరై పోటీలను ప్రారంభించి క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు.ఈ సందర్భంగా ఇంచార్జి జిల్లా యువజన క్రీడా అధికారి వెంకటేష్ మాట్లాడుతూ విద్యార్థులు తమ చేతిలో ఉన్న సెల్ ఫోన్ దూరం చేసుకొని మైదానాలలో తమ సమయాన్ని కేటాయించుకోవలని,పాఠశాల స్థాయి మండల స్థాయి క్రీడా పోటీలలో పాల్గొని జిల్లా టీం కు సెలెక్ట్ అయ్యే విధంగా మీ ప్రదర్శన చూయించాలని కోరారు. వాలీబాల్,ఖో ఖో,కబడ్డీ క్రీడలలో జిల్లా స్థాయి పోటీలను నిర్వహించి వారిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను నారాయణపేట జిల్లా తరుపున ఉమ్మడి పాలమూరు జిల్లా స్థాయి పోటీల్లో పాల్గొంటారని అలాగే ఈ క్రీడా పోటీలను విజయవంతం చేసిన వ్యాయమ ఉపాధ్యాయులకు సహకరించిన జిల్లా విద్యాశాఖ అధికారులకు ధన్యవాదాలను స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లాలోని వ్యాయమ ఉపాధ్యాయులు గొడుగు నర్సిములు, రత్నయ్య, వెంకటప్ప, సాయినాథ్, బాలరాజు, నర్సింహారెడ్డి, కతలప్ప, ఆనంతసేన, విష్ణువర్ధన్ రెడ్డి, రాజేశ్వరి, వెంకటేష్, సౌమ్య, రామకృష్ణ రెడ్డి, రాజశేఖర్, నర్సింహా, శ్రీధర్, చంద్రశేఖర్, ఈశ్వర్, బసంత్ రెడ్డి, రమేష్, బీరప్ప, రాజేష్, శశికాంత్ రెడ్డి లు మరియు వివిధ మండలాల నుండి క్రీడాకారులు పాల్గొన్నారు