BREAKING
ఎల్టీ లైన్ తగిలి ఎద్దు మృతి కేంద్ర ఎన్నికల అధికారి జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధి మద్దాల ప్రసాద్ డిమాండ్ చేశారు తెలుగు ఇండస్ట్రీ నాకు తల్లిలాంటిది.. యాంకర్ సుమ కనకాల ఎమోషనల్ పోస్ట్ వైరల్ పోషణ్ అభియాన్ పై అవగాహన కార్యక్రమం హక్కులతో పాటు బాధ్యతలను గుర్తుంచుకోవాలి పారిశుద్ధ్య కార్మికులకు వైద్య పరీక్షలు వైద్యం అందలేదని తల్లిని వీల్‌చైర్‌లో ఎమ్మెల్యే ఇంటికి తీసుకెళ్లిన కుమారుడు! నెల్లూరు కార్పొరేషన్‌లో ఎక్కడిక్కడ దోపిడి అర్హులైన అందరికి రేషన్‌, పౌష్టికాహారం అందేలా చర్యలు - రాష్ట్ర ఫుడ్‌ కమిషన్‌ చైర్మన్‌ గోలి శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా కలెక్టర్‌ రాజర్షి షా పదవీ విరమణ పొందిన వారికి కాట సుధా శ్రీనివాస్ గౌడ్ ఆత్మీయ సన్మానం సూర్య కథనానికి స్పందించిన వైద్యశాఖ - శ్రీరాంపూర్‌ గూడ లో ప్రత్యేక వైద్య శిబిరం చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ను వెంటనే తొలగించాలి భూ రీ సర్వేను సకాలంలో పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్ సయ్యద్ చాంద్‌కు సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేసిన ఆత్రం సుగుణక్క విమానంలో తీవ్ర కలకలం.. 15 వేల అడుగులకు పడిపోయిన విమానం

అడ్డుకునేందుకు వైసీపీ కుట్రలు: చంద్రబాబు

Select Suryaa Now
అడ్డుకునేందుకు వైసీపీ కుట్రలు: చంద్రబాబు

అమరావతి, సూర్య న్యూస్ నెట్వర్క్ : అమరావతి అభివృద్ధిని అడ్డుకునేందుకు వైసీపీ ప్రభుత్వం గతంలో అనేక ప్రయత్నాలు చేసిందని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించారు. అమరావతిని ఎడారి, శ్మశానంగా అభివర్ణించారని విమర్శించారు.

అమరావతిని ఆ భగవంతుడే కాపాడాడని చంద్రబాబు వ్యాఖ్యానించారు. అమరావతి జోలికి ఎవరైనా వస్తే వారికే నష్టం జరుగుతుందని అన్నారు. గతంలో మూడు రాజధానుల ప్రతిపాదనను తెరపైకి తెచ్చారని, ఇప్పుడు కూడా కొందరు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు.

ప్రపంచ స్థాయి రాజధానిగా అమరావతి

ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా అమరావతి ప్రపంచ స్థాయి రాజధానిగా అభివృద్ధి చెందుతుందని చంద్రబాబు స్పష్టం చేశారు. అమరావతితో పాటు విజయవాడకు కృష్ణా నదీ జలాలే ప్రత్యేక అందమని పేర్కొన్నారు.

గ్రీన్‌ ఎనర్జీతో విద్యుత్‌

అమరావతిలో విద్యుత్‌ అవసరాలను ప్రధానంగా పచ్చ ఇంధన వనరుల ద్వారా తీర్చేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని చంద్రబాబు తెలిపారు. భవిష్యత్‌ రవాణా అవసరాలను దృష్టిలో పెట్టుకుని అమరావతికి బుల్లెట్‌ రైలు అనుసంధానం తీసుకురావాలనే లక్ష్యాన్ని కూడా ఆయన ప్రస్తావించారు.

అమరావతి అభివృద్ధి, రాజధాని నిర్మాణం, ఆధునిక మౌలిక వసతుల కల్పనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని చంద్రబాబు పేర్కొన్నారు.