కరీంనగర్‌లో నూతన కలెక్టరేట్ ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
సూర్య కరీంనగర్ ప్రతినిధి:కరీంనగర్‌లో నూతన కలెక్టరేట్ భవన సముదాయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం కలెక్టరేట్‌లో జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు.కార్యక్రమానికి కేంద్ర మంత్రి బండి సంజయ్, మంత్రులు తుమ్మల నాగేశ్వర్ రావు, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారులు హాజరయ్యారు.కరీంనగర్‌లో పలు అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపనలు చేయడంతో పాటు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు.