BREAKING
జిల్లాలో పర్యాటక రంగ అభివృద్ధిపై ప్రత్యేక చర్యలు - జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) యువరాజ్ మర్మాట్ పోగొట్టుకున్న పర్సు ను 24 గంటల లోపే బాధితుడికి అప్పగించిన రామకృష్ణాపూర్ పోలీసులు. స్వచ్ఛతలో భాగస్వాములుకండి.. -సర్పంచ్ కవిత నర్సింగ్ విద్యార్థిని ఆత్మ హత్య.. ప్రతి నెల మొదటి రోజే అవ్వాతాతల ఇంటి వద్దకు పింఛన్ విజయలక్ష్మీ గునుకుల-జనసేన జిల్లాలో భూ భారతి రీ-సర్వే ప్రక్రియను పారదర్శకంగా, ఖచ్చితత్వంతో, ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా నిర్వహించాలి. జిల్లా కలెక్టర్ కె. హైమావతి అధికారులను ఆదేశించారు. జిల్లాస్థాయి వాకృత్వ పోటీల్లో మండపేట విద్యార్థులు ప్రతిభ ఎట్టకేలకు రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న సుడిగాలి సుధీర్ గోట్ మూవీ గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే ని కలిసిన పాండురంగ రిజర్వాయర్ ముంపు బాధితులు వృద్ధాప్యాన్ని గౌరవిద్దాంపై అవగాహన పేదల జీవితాల్లో ఆనందం నింపుతున్నకూటమి ప్రభుత్వ లక్ష్యం నిజాంపేటలో ఉచిత మెగా వైద్య శిబిరం రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావంపై కేబినెట్‌ సుదీర్ఘ చర్చ.. అఖిలపక్ష సమావేశానికి సీఎం రేవంత్ ఆదేశం మానవతా స్ఫూర్తితో రక్తదానం రాష్ట్ర స్థాయి కుంగ్- ఫూ కరాటే లో ప్రతిభ కనబరిచిన విద్యార్థినీయులు

బేతపల్లిలో రూ.15 లక్షలతో సీసీ రోడ్డు పనులకు భూమిపూజ

Select Suryaa Now
బేతపల్లిలో రూ.15 లక్షలతో సీసీ రోడ్డు పనులకు భూమిపూజ

అనంతపురం బ్యూరో: అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం గుత్తి మండలం బేతపల్లి గ్రామంలో పల్లె పండుగ 3.0 కార్యక్రమంలో భాగంగా రూ.15 లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు బుధవారం భూమిపూజ నిర్వహించారు. రాష్ట్ర కార్మిక సంక్షేమ శాఖ బోర్డు చైర్మన్, మాజీ జిల్లా అధ్యక్షులు వెంకట శివుడు యాదవ్, గుమ్మనూరు ఈశ్వర్ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వెంకట శివుడు యాదవ్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులను మరింత బలోపేతం చేసి, ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా పల్లె పండుగ 3.0 కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ఇందులో భాగంగా బేతపల్లి గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణానికి రూ.15 లక్షలు కేటాయించినట్లు చెప్పారు.

పల్లె పండుగ 3.0లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా రూ.11,085 కోట్ల విలువైన గ్రామీణ అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. గ్రామాలకు మెరుగైన రహదారి సౌకర్యం కల్పించేందుకు సీసీ, బీటీ రోడ్ల నిర్మాణానికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు పేర్కొన్నారు. సుమారు 9,500 కిలోమీటర్ల బీటీ రోడ్లు, 6,000 కిలోమీటర్ల సీసీ రోడ్ల నిర్మాణానికి ప్రణాళిక రూపొందించినట్లు వివరించారు.

అలాగే గ్రామాల్లో కొత్త పంచాయతీ భవనాలు, బస్‌ షెల్టర్లు, రచ్చబండలు, డ్రైనేజీ వ్యవస్థలు, వీధిలైట్లు, తాగునీటి సదుపాయాలు వంటి మౌలిక వసతుల కల్పనకు చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. వర్షపు నీరు, మురుగునీటి నిర్వహణ కోసం సుమారు 1,000 కిలోమీటర్ల మేర మ్యాజిక్ డ్రెయిన్ల నిర్మాణం చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.

గ్రామీణ ప్రాంతాల్లో రహదారులు, తాగునీరు, పారిశుధ్యం, రవాణా, వ్యవసాయం, పాడి పరిశ్రమలకు అవసరమైన మౌలిక వసతులను మెరుగుపరిచేలా పల్లె పండుగ 3.0లో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు వెంకట శివుడు యాదవ్ తెలిపారు. గ్రామాల అవసరాలకు అనుగుణంగా పనులను ముందుకు తీసుకెళ్లడంతో పాటు రైతులు, పాడి రైతులకు అవసరమైన వసతులు కల్పించడంపై దృష్టి సారిస్తున్నట్లు చెప్పారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి బద్రి వలి, మార్కెట్ యార్డ్ చైర్మన్ ప్రతాప్, టౌన్ అధ్యక్షులు ఎం.కె. చౌదరి, మండల అధ్యక్షులు లక్ష్మీ రంగయ్య యాదవ్, మండల ప్రధాన కార్యదర్శి పల్లా సాంబయ్య, తెలుగు యువత కిట్టి యాదవ్, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, గుత్తి మండల కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రభుత్వ అధికారులు తదితరులు పాల్గొన్నారు.