హరిహరులను విభజించే హక్కు ఎవరిచ్చారు
- సీఎం రేవంత్ రెడ్డి ని ప్రశ్నించిన బిజెపి
- జిల్లా మీడియా కన్వీనర్ సాధ మల్లారెడ్డి
శ్రీరాముడు, పరమశివుడిని పేదలు–ధనికులు, ఉత్తరాది–దక్షిణాది అంటూ విభజించేలా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను బీజేపీ రంగారెడ్డి జిల్లా మీడియా కన్వీనర్ సాధ మల్లారెడ్డి ఖండించారు. హరిహరులు హిందువులందరికీ ఆరాధ్య దైవాలని, భక్తికి ప్రాంతం, కులం, ఆర్థిక స్థాయి వంటి భేదాలు ఉండవని అన్నారు.
రాజకీయ ప్రయోజనాల కోసం దేవుళ్లను రాజకీయాల్లోకి లాగడం, ప్రజల విశ్వాసాలను విభజించేలా వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదన్నారు. ముఖ్యమంత్రి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని మల్లారెడ్డి డిమాండ్ చేశారు.
తోకల శ్రీనివాస్, మేజర్ న్యూస్ కందుకూరు