గరుడేశ్వర్ ప్రత్యేక పూజలు
నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరంకార్తీకమాస పర్వదినాన్ని పురస్కరించుకొని పి. గన్నవరం గ్రామంలోని శ్రీ గరుడేశ్వర స్వామి ఆలయంలో అర్చకులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. స్వామివారికి విశేష అభిషేకాలు, అర్చనలు, పూజలు భక్తిశ్రద్ధలతో జరిపించారు. ఆలయాన్ని భక్తిశోభతో అలంకరించి ప్రత్యేక ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పారు. కార్తీకమాసం సందర్భంగా స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు ఆసక్తి చూపించారు. భక్తులు స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.