కోటిలింగాల ఆలయ అభివృద్ధి గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి
సూర్య ఎండపల్లి:వెల్గటూర్ మండలం కోటిలింగాల శ్రీ కోటేశ్వర స్వామి దేవస్థానంలో ఆలయ పునర్నిర్మాణ పనులు, గోదావరి పుష్కరాల ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ గురువారం పరిశీలించారు.
పుష్కరాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఘాట్లు, రహదారులు, తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్, పార్కింగ్, వైద్య, భద్రతా సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల ఆర్డీఓ మధుసూదన్, మండల తహసీల్దార్, ఎంపీఓ, ఏఈలు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.