BREAKING
వాల్ మార్ట్ వైస్ ప్రెసిడెంట్ తో లోకేష్ భేటీ జి. లింగాపురం ఎంపీటీసీ షాహిదాకు ఎమ్మెల్యే బుడ్డా ఆశీస్సులు పల్నాడు జిల్లాలో పంచాయతీఎన్నికలకు సర్వం సిద్ధం ఎస్పీ జగదీష్ ఆదహళ్లి కార్మికుల సమస్యలు పరిష్కరించకుంటే ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సమ్మెకు సిద్ధం అభివృద్ధి పనులలో పురోగతి సాధించాలి - జిల్లా కలెక్టర్ కె.హరిత నత్నయపల్లి నుండి పటాన్ చెరువ్యు వరకు బస్సు సౌకర్యం కల్పించాలి..డి ఎం కు వినతి పత్రం.... అర్హులందరికీ చేయూత పింఛన్లు - జిల్లా కలెక్టర్ కె. హరిత లైంగిక వేధింపుల ఫిర్యాదును స్వీకరించని రాజేంద్రనగర్ పోలీసులు : హేమా సుదర్శన్ దివ్యాంగ విద్యార్థులకు క్రీడా పోటీలు ప్రతిభను ప్రోత్సహిస్తూ.. విజేతలకు బహుమతుల ప్రదానం నగరం గ్రామంలో ఎల్ నినో పై గ్రామ సభ అండర్‌ 19 ఆసియా కప్‌ సెమీఫైనల్‌: అదరగొట్టిన భారత బౌలర్లు.. ఆఫ్ఘనిస్తాన్ ఎంత లక్ష్యమంటే? 21 సిక్సర్లతో కివీస్ యువ బ్యాటర్ విధ్వంసం.. లిస్ట్-ఏ క్రికెట్‌లో డబుల్ సెంచరీతో సరికొత్త చరిత్ర పవన్ కల్యాణ్ ఓజీ సినిమాపై క్రేజీ అప్‌డేట్.. మూడో భాగం కూడా రానుందంటూ తమన్ హింట్ కోటిలింగాల ఆలయ అభివృద్ధి గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి భారత్-న్యూజిలాండ్ నాలుగో వన్డే: తుదిజట్టు కూర్పుపై ఆకాష్ చోప్రా ఆసక్తికర జోస్యం

తుఫానుకు దెబ్బతిన్న వరి పొలాలు పరిశీలించిన వ్యవసాయాధికారి

Select Suryaa Now
తుఫానుకు దెబ్బతిన్న వరి పొలాలు పరిశీలించిన వ్యవసాయాధికారి

నగరం, మేజర్ న్యూస్:ఆర్నాబ్, మురసు తుఫాను కారణంగా దెబ్బతిన్న వరి పంట పొలాలను రేపల్లె ఇంచార్జ్ సహాయ వ్యవసాయ సంచాలకులు, స్థానిక మండల వ్యవసాయాధికారి వేమూరి రమేష్ బాబు గురువారం మండల పరిధిలోని పూడివాడ వరి పొలాలు సందర్శించారు. పొలంలో నిల్వ ఉన్న వర్షపు నీటిని అంతర కాల్వల ద్వారా బయటికి పంపి, పడిపోయిన దుబ్బులను పైకి లేపి కట్టుకోవాలని రైతులకు సూచనలు చేశారు. పిలక దశలో ఉన్న పైరు త్వరగా కోలుకునేందుకు నీరు తీసిన వెంటనే ఎకరాకు 20 కిలోల యూరియా, 20 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ వేయాలన్నారు. పూత దశలో ఉన్న పైరుకు ఎండాకు తెగులు ఆశిస్తుందని దీని నివారణకు ప్లాంటోమైసిన్ 1 మి.లీ., కాపర్ హైడ్రాక్సైడ్ 2 గ్రా. లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలని, మాగుడు తెగులున్న పైరుకు హెక్సాకోనాజోల్ 400 మీ. లి. లేక ప్రోఫీకోనాజోల్ 200 మీ. లి. ఎకరానికి పిచికారి చేయాలన్నారు. ఆకు ముడత పురుగు ఆశించిన పైరుకు కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 400 గ్రా. లేక క్లోరాన్ట్రానిప్రోల్ 60 మి.లీ. 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలన్నారు. దోమపోటు, మానిపండు నివారణకు ప్రోపికోనాజోల్ 200 మి.లీ., పైమెట్రోజిన్ 120 గ్రా. లేక ట్రైఫ్ల్యుమెజోపైరం 10 ఎస్ సి 96 మి.లీ. గింజ గట్టిపడే దశలో ఉన్న పైరుకు గింజల్లో మొలక వచ్చే ప్రమాదముందని నీరు తీసిన వెంటనే 50 గ్రా. ఉప్పు లీటరు నీటితో పిచికారి చేసి గింజ మొలకెత్తకుండా ఉండి, రంగు మారడం తగ్గుతుందని ఆయన తెలిపారు. తొలుత క్షేత్ర సందర్శన చేశారు. కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారులు కె. నాగ శ్రీనివాసరావు, కె. వంశీకృష్ణ, గ్రామ వ్యవసాయ సహాయకులు, రైతులు పాల్గొన్నారు.