BREAKING
అభివృద్ధి పనులలో పురోగతి సాధించాలి - జిల్లా కలెక్టర్ కె.హరిత నత్నయపల్లి నుండి పటాన్ చెరువ్యు వరకు బస్సు సౌకర్యం కల్పించాలి..డి ఎం కు వినతి పత్రం.... అర్హులందరికీ చేయూత పింఛన్లు - జిల్లా కలెక్టర్ కె. హరిత లైంగిక వేధింపుల ఫిర్యాదును స్వీకరించని రాజేంద్రనగర్ పోలీసులు : హేమా సుదర్శన్ దివ్యాంగ విద్యార్థులకు క్రీడా పోటీలు ప్రతిభను ప్రోత్సహిస్తూ.. విజేతలకు బహుమతుల ప్రదానం నగరం గ్రామంలో ఎల్ నినో పై గ్రామ సభ అండర్‌ 19 ఆసియా కప్‌ సెమీఫైనల్‌: అదరగొట్టిన భారత బౌలర్లు.. ఆఫ్ఘనిస్తాన్ ఎంత లక్ష్యమంటే? 21 సిక్సర్లతో కివీస్ యువ బ్యాటర్ విధ్వంసం.. లిస్ట్-ఏ క్రికెట్‌లో డబుల్ సెంచరీతో సరికొత్త చరిత్ర పవన్ కల్యాణ్ ఓజీ సినిమాపై క్రేజీ అప్‌డేట్.. మూడో భాగం కూడా రానుందంటూ తమన్ హింట్ కోటిలింగాల ఆలయ అభివృద్ధి గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి భారత్-న్యూజిలాండ్ నాలుగో వన్డే: తుదిజట్టు కూర్పుపై ఆకాష్ చోప్రా ఆసక్తికర జోస్యం అఖిల భారత కిసాన్ సభను జయప్రదం చేయండి _ నవంబర్ 15 నల్లగొండలో జాతీయ మహాసభలు ఓటీటీలో అగ్రస్థానంలో దూసుకుపోతున్న సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా ఇదే సుడిగాలి సుధీర్ ‘గోట్’ మూవీ రివ్యూ: టెలివిజన్ స్టార్ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా సోషల్ మీడియా ట్రోలింగ్‌పై బాబిల్ ఖాన్ స్పందన: తాను భావోద్వేగపరుడినే కానీ బలహీనుడిని కాదంటూ నటుడి ఘాటు వ్యాఖ్యలు

వైసీపీకి ఓటేశాడని పేదవాడి గుడిసె కూల్చివేస్తారా ? టీడీపీపై వైసీపీ నేత డి. నజీర్ అహ్మద్ ఆగ్రహం

Select Suryaa Now
వైసీపీకి ఓటేశాడని పేదవాడి గుడిసె కూల్చివేస్తారా ? టీడీపీపై  వైసీపీ నేత డి. నజీర్ అహ్మద్ ఆగ్రహం

ఎమ్మిగనూరు, సూర్య ప్రతినిధి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగ ఎన్నికల్లో ప్రచారం చేశాడని, ఆ పార్టీకి ఓటు వేశాడనే రాజకీయ కక్షతోనే 44వ వార్డుకు చెందిన పార్టీ కార్యకర్త షఫీ రేకుల గుడిసెను కూల్చివేశారని వైసీపీ ఎమ్మిగనూరు నియోజకవర్గ యువజన విభాగ అధ్యక్షుడు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ డి. నజీర్ అహ్మద్ ఆరోపించారు. 44వ వార్డు వైసీపీ అభ్యర్థి ఇబ్రహీంతో కలిసి కూల్చివేతకు గురైన నివాసాన్ని పరిశీలించి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.
ఈ సందర్భంగా నజీర్ అహ్మద్ మాట్లాడుతూ.. టీడీపీ కౌన్సిలర్ ఈరన్న అధికారాన్ని అడ్డుపెట్టుకుని మున్సిపల్ అధికారుల ద్వారా ఈ కూల్చివేతకు పాల్పడ్డారని బాధితుడు ఆరోపిస్తున్నట్లు తెలిపారు. తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో పోలీసులను మోహరించి, ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా, ఇంట్లోని సామాన్లు తీసుకునే అవకాశం కూడా కల్పించకుండా గుడిసెను కూల్చివేయడం ఏమిటని ప్రశ్నించారు.రాజకీయంగా విభేదించినంత మాత్రాన పేద కుటుంబాల నివాసాలను కూల్చివేయడం సమంజసం కాదని, ఎన్నికల్లో గెలిచినంత మాత్రాన ప్రజలపై కక్ష సాధించే అధికారం ఎవరికీ లేదన్నారు. సుమారు రూ.5 లక్షల మేర ఆస్తి నష్టం జరిగిందని బాధితుడు చెబుతున్న నేపథ్యంలో అధికారులు దీనిపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ అధికారులు తక్షణమే స్పందించి షఫీ కుటుంబానికి న్యాయం చేయాలని, ప్రత్యామ్నాయ నివాసం కల్పించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. సమస్య పరిష్కారం కాకపోతే మున్సిపల్ కార్యాలయం వద్ద ఆందోళన చేపడతామని హెచ్చరించారు.
ఈ ఘటనను వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి, మాజీ ఎంపీ బుట్టా రేణుక, జిల్లా అధ్యక్షుడు ఎస్సీ మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పార్టీ తరఫున పోరాటాన్ని కొనసాగిస్తామని నజీర్ అహ్మద్ వెల్లడించారు.
ఎన్నికల కక్షతోనే షఫీ నివాసం కూల్చివేశారని ఆరోపణ.. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని హెచ్చరిక చేశారు. అనంతరం షఫి కుటుంబానికి తగిన న్యాయం చెయ్యకపోతే కనీసం 3 సెంట్లు స్థలం కేటాయించాలి అని కమిషనర్ గంగిరెడ్డికి మున్సిపల్ మాజీ వైస్ చైర్మెన్ నజీర్ అహమ్మద్ విన్నవించడం జరిగింది.
A. R. శరత్ కుమార్, సూర్య ప్రతినిధి ఎమ్మిగనూరు, కర్నూలు జిల్లా