BREAKING
పొన్నూరు పట్టణంలో విజిలెన్స్ దాడులతో రైస్ అండ్ జనరల్ స్టోర్స్ మూసివేత పారిశుధ్యం పనులు పరిశీలించిన కౌన్సిలర్లు ముంబైలో బాంబు బెదిరింపుల కలకలం.. దాద్‌పల్లిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం కానున్న 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. తుఫాన్‌గా మారే అవకాశం! వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ కమిటీల నియామకం మెరుగైన వైద్యానికి రూ.7 లక్షల ఎల్‌ఓసీ అందజేత మంత్రి కందుల దుర్గేష్‌ను కలిసిన పి. గన్నవరం జడ్పీటీసీ యడ్ల సుబ్బలక్ష్మి దంపతులు ఉత్తర కొరియా రాజ్యాంగంలో చారిత్రాత్మక మార్పులు.. శోధనలో నైతికత, జవాబుదారీతనం అవశ్యం కోరిటికల్, లింగట్ల, వాంకిడి కేజీబీవీ పాఠశాలలను సందర్శించిన డీఈవో మాధవి అంబులెన్స్ లో గర్భిణీ ప్రసవం...... వడూర్ లో నీటి తొట్టి నిర్మాణానికి భూమి పూజ కార్తీకమాస శోభ.. రాజరాజేశ్వర స్వామి సన్నిధిలో ప్రత్యేక పూజలు

లైంగిక వేధింపుల ఫిర్యాదును స్వీకరించని రాజేంద్రనగర్ పోలీసులు : హేమా సుదర్శన్

Select Suryaa Now
లైంగిక వేధింపుల ఫిర్యాదును స్వీకరించని రాజేంద్రనగర్ పోలీసులు : హేమా సుదర్శన్

రంగారెడ్డి : రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో మహిళా లెక్చరర్ తేజస్విపై జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న లైంగిక వేధింపుల ఘటనపై ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలు హేమా సుదర్శన్ జిల్లోజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితురాలు ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించినా రాజేంద్రనగర్ పోలీసులు స్వీకరించకపోవడం బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని విమర్శించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విద్యాసంస్థలో మహిళా లెక్చరర్‌కే రక్షణ లేకపోతే అక్కడ చదువుకుంటున్న విద్యార్థినుల భద్రతకు ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. బాధితురాలి ఫిర్యాదును తక్షణమే స్వీకరించి, ఘటనపై నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

రాష్ట్రంలో హోంమంత్రి పదవిని భర్తీ చేయకపోవడం వల్ల మహిళల భద్రతపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ప్రశ్నార్థకంగా మారుతోందన్నారు. మహిళలపై వేధింపులు, దాడులు జరిగినప్పుడు ప్రభుత్వం తక్షణమే స్పందించాలని హితవు పలికారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే ఈ ఘటనపై జోక్యం చేసుకుని సమగ్ర విచారణకు ఆదేశించాలని కోరారు. మహిళా కమిషన్ కూడా ఈ ఘటనను సుమోటోగా పరిగణించి బాధితురాలికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. బాధిత మహిళకు న్యాయం జరిగే వరకు ఆమ్ ఆద్మీ పార్టీ అండగా ఉంటుందని ఆమె స్పష్టం చేశారు.

వడ్ల శ్రీనివాస చారి :  రంగారెడ్డి, మేజర్ న్యూస్