BREAKING
పొన్నూరు పట్టణంలో విజిలెన్స్ దాడులతో రైస్ అండ్ జనరల్ స్టోర్స్ మూసివేత పారిశుధ్యం పనులు పరిశీలించిన కౌన్సిలర్లు ముంబైలో బాంబు బెదిరింపుల కలకలం.. దాద్‌పల్లిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం కానున్న 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. తుఫాన్‌గా మారే అవకాశం! వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ కమిటీల నియామకం మెరుగైన వైద్యానికి రూ.7 లక్షల ఎల్‌ఓసీ అందజేత మంత్రి కందుల దుర్గేష్‌ను కలిసిన పి. గన్నవరం జడ్పీటీసీ యడ్ల సుబ్బలక్ష్మి దంపతులు ఉత్తర కొరియా రాజ్యాంగంలో చారిత్రాత్మక మార్పులు.. శోధనలో నైతికత, జవాబుదారీతనం అవశ్యం కోరిటికల్, లింగట్ల, వాంకిడి కేజీబీవీ పాఠశాలలను సందర్శించిన డీఈవో మాధవి అంబులెన్స్ లో గర్భిణీ ప్రసవం...... వడూర్ లో నీటి తొట్టి నిర్మాణానికి భూమి పూజ కార్తీకమాస శోభ.. రాజరాజేశ్వర స్వామి సన్నిధిలో ప్రత్యేక పూజలు

నగరం గ్రామంలో ఎల్ నినో పై గ్రామ సభ

Select Suryaa Now
నగరం గ్రామంలో ఎల్ నినో పై గ్రామ సభ

రామాయంపేట ; నిజాంపేట మండల పరిధిలోనినగరం గ్రామంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎల్ నినో వర్షా భావ పరిస్థితు2ల గురించి రైతులకు గ్రామ సభలో అవగాహన కార్యక్రమం చేపట్టడం జరిగిందని వ్యవసాయ అధికారి సోమలింగారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత ఎల్ నినో పరిస్థితుల్లో రైతులు వరి పంటకు బదులుగా తక్కువ నీటితో పండేటటువంటి పంటలైన సన్ఫ్లవర్ ,మొక్కజొన్న ,జొన్న , శనగలు,కూరగాయలు ఆకుకూరలు మొదలగు పంటలను సాగు చేసుకోవడం ద్వారా ఎల్ నినో పరిస్థితులను ధీటు గా ఎదుర్కోవచ్చు అని తెలిపారు .అదేవిధంగా నీటిని నిలువ చేసుకోవడానికి ఫాం పాండ్స్,కమ్యూనిటీ సోక్ పిట్స్ ,మ్యాజిక్ సోక్ పిట్స్ లాంటివి చేపట్టాలని కోరారు. అలాగే వి బిజీ రాంజీ పథకాన్ని సమర్థవంతంగా వినియోగించవలసిందిగా సూచన చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల తహసిల్దార్ శ్రీనివాస్ గారు ,ఎంపీడీవో ముజాహిద్, మండల వ్యవసాయ అధికారి సోమలింగారెడ్డి,ఏ ఈ ఎలక్ట్రిసిటీ గణేష్  , గ్రామ సర్పంచ్ అంతంపల్లి సుశీల, ఉప సర్పంచ్ నాజం,పంచాయతీ సెక్రెటరీ మొహమ్మద్ ఆరీఫ్ హుస్సేన్, గ్రామ స్థాయి అధికారులు,వార్డు సభ్యులు ,సుభాష్, లక్ష్మణ్,  కనకవ్వ మరియు రైతులు  దేవేందర్, గోపి , మహిళా సంఘాల సభ్యులు, పాల్గొనడం జరిగింది.