BREAKING
వాల్ మార్ట్ వైస్ ప్రెసిడెంట్ తో లోకేష్ భేటీ జి. లింగాపురం ఎంపీటీసీ షాహిదాకు ఎమ్మెల్యే బుడ్డా ఆశీస్సులు పల్నాడు జిల్లాలో పంచాయతీఎన్నికలకు సర్వం సిద్ధం ఎస్పీ జగదీష్ ఆదహళ్లి కార్మికుల సమస్యలు పరిష్కరించకుంటే ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సమ్మెకు సిద్ధం అభివృద్ధి పనులలో పురోగతి సాధించాలి - జిల్లా కలెక్టర్ కె.హరిత నత్నయపల్లి నుండి పటాన్ చెరువ్యు వరకు బస్సు సౌకర్యం కల్పించాలి..డి ఎం కు వినతి పత్రం.... అర్హులందరికీ చేయూత పింఛన్లు - జిల్లా కలెక్టర్ కె. హరిత లైంగిక వేధింపుల ఫిర్యాదును స్వీకరించని రాజేంద్రనగర్ పోలీసులు : హేమా సుదర్శన్ దివ్యాంగ విద్యార్థులకు క్రీడా పోటీలు ప్రతిభను ప్రోత్సహిస్తూ.. విజేతలకు బహుమతుల ప్రదానం నగరం గ్రామంలో ఎల్ నినో పై గ్రామ సభ అండర్‌ 19 ఆసియా కప్‌ సెమీఫైనల్‌: అదరగొట్టిన భారత బౌలర్లు.. ఆఫ్ఘనిస్తాన్ ఎంత లక్ష్యమంటే? 21 సిక్సర్లతో కివీస్ యువ బ్యాటర్ విధ్వంసం.. లిస్ట్-ఏ క్రికెట్‌లో డబుల్ సెంచరీతో సరికొత్త చరిత్ర పవన్ కల్యాణ్ ఓజీ సినిమాపై క్రేజీ అప్‌డేట్.. మూడో భాగం కూడా రానుందంటూ తమన్ హింట్ కోటిలింగాల ఆలయ అభివృద్ధి గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి భారత్-న్యూజిలాండ్ నాలుగో వన్డే: తుదిజట్టు కూర్పుపై ఆకాష్ చోప్రా ఆసక్తికర జోస్యం

శబరిమలై పాదయాత్ర బృందానికి మాజీ మంత్రి విడదల రజని ఆత్మీయ పలకరింపు

Select Suryaa Now
శబరిమలై పాదయాత్ర బృందానికి మాజీ మంత్రి విడదల రజని ఆత్మీయ పలకరింపు

చిలకలూరిపేట మేజర్ న్యూస్: అబ్జర్వర్ చిట్టా విజయభాస్కర్ రెడ్డి సత్తెనపల్లి నుంచి శబరిమలై క్షేత్రానికి పాదయాత్రగా బయలుదేరారు.ఈ క్రమంలో ఆయన వెంట ఉన్న యాత్రికుల బృందం ప్రయాణ మార్గంలో చిలకలూరిపేట మండలం లింగంగుంట్ల గ్రామంలోని ఆలయంలో విశ్రాంతి తీసుకుంది.పాదయాత్ర బృందం అక్కడ బస చేసిన విషయం తెలుసుకున్న మాజీ మంత్రి విడదల రజని గురువారం ఆలయానికి వెళ్లి చిట్టా విజయభాస్కర్ రెడ్డితో పాటు యాత్రలో పాల్గొంటున్న సభ్యులను ఆత్మీయంగా పలకరించారు.ఈ సందర్భంగా వారి పాదయాత్ర విశేషాలను అడిగి తెలుసుకున్నారు.భక్తిశ్రద్ధలతో చేపట్టిన వారి పాదయాత్ర ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా కొనసాగాలని విడదల రజని ఆకాంక్షించారు.

కొణిదెన నరేంద్ర, చిలకలూరిపేట సూర్య రిపోర్టర్.