BREAKING
పొన్నూరు పట్టణంలో విజిలెన్స్ దాడులతో రైస్ అండ్ జనరల్ స్టోర్స్ మూసివేత పారిశుధ్యం పనులు పరిశీలించిన కౌన్సిలర్లు ముంబైలో బాంబు బెదిరింపుల కలకలం.. దాద్‌పల్లిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం కానున్న 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. తుఫాన్‌గా మారే అవకాశం! వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ కమిటీల నియామకం మెరుగైన వైద్యానికి రూ.7 లక్షల ఎల్‌ఓసీ అందజేత మంత్రి కందుల దుర్గేష్‌ను కలిసిన పి. గన్నవరం జడ్పీటీసీ యడ్ల సుబ్బలక్ష్మి దంపతులు ఉత్తర కొరియా రాజ్యాంగంలో చారిత్రాత్మక మార్పులు.. శోధనలో నైతికత, జవాబుదారీతనం అవశ్యం కోరిటికల్, లింగట్ల, వాంకిడి కేజీబీవీ పాఠశాలలను సందర్శించిన డీఈవో మాధవి అంబులెన్స్ లో గర్భిణీ ప్రసవం...... వడూర్ లో నీటి తొట్టి నిర్మాణానికి భూమి పూజ కార్తీకమాస శోభ.. రాజరాజేశ్వర స్వామి సన్నిధిలో ప్రత్యేక పూజలు

దివ్యాంగ విద్యార్థులకు క్రీడా పోటీలు ప్రతిభను ప్రోత్సహిస్తూ.. విజేతలకు బహుమతుల ప్రదానం

Select Suryaa Now
దివ్యాంగ విద్యార్థులకు క్రీడా పోటీలు  ప్రతిభను ప్రోత్సహిస్తూ.. విజేతలకు బహుమతుల ప్రదానం

రామాయంపేట ; నిజాంపేట సమగ్ర శిక్ష మెదక్ జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిజాంపేట మండలంలోని దివ్యాంగ విద్యార్థులకు గురువారం భవిత కేంద్రంలో వివిధ క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల విద్యాధికారి (ఎంఈఓ) యాదగిరి హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ఉత్సాహంగా క్రీడా పోటీల్లో పాల్గొన్నారు. పోటీల్లో ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించిన విద్యార్థులకు ముఖ్య అతిథి బహుమతులు అందజేశారు. గెలుపోటములతో సంబంధం లేకుండా పోటీల్లో పాల్గొన్న విద్యార్థులందరికీ బహుమతులు అందించి వారిని ప్రోత్సహించారు. దివ్యాంగ విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని నిర్వాహకులు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఐఈఆర్పీ రాజయ్య, ప్రాథమిక పాఠశాల హెచ్‌ఎం సాగరిక, జెడ్పీహెచ్‌ఎస్ నస్కల్ హెచ్‌ఎం సత్యం రెడ్డి, నగరం హెచ్‌ఎం ఉమారాణి, బచ్చురాజుపల్లి హెచ్‌ఎం రాజు, ఉపాధ్యాయులు ఎల్లం, సుమలత, మన్మధ, వెంకటేష్, జాకియా, పాఠశాల ఆయాలు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.