అఖిల భారత కిసాన్ సభను జయప్రదం చేయండి _ నవంబర్ 15 నల్లగొండలో జాతీయ మహాసభలు
లింగాల :
కేంద్ర ప్రభుత్వం వ్యవసాయరంగా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామని సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ఎం శంకర్ నాయక్ అన్నారు.
అఖిలభారత కిసాన్ సభ ఈ నెల 15న నల్లగొండలో జరిగే జాతీయ మహాసభలు భారీ బహిరంగ సభకు జయప్రదం చేయాలని మండల కేంద్రంలో గురువారం నాడు తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో జీబు జాత ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాగర్ కర్నూల్ జిల్లాలో 20 మండలాలను కరువు ప్రకటించారని అన్నారు. కరువు మండలాలుగా ప్రకటించిన మండలాల్లో కరువు సహాయక చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం రాష్ట్రాన్ని పట్టించుకోకపోవడం దుర్మార్గమని అన్నారు. కేంద్ర ప్రభుత్వం కరువు సహాయక బృందాలను పంపించి 50 వేల కోట్ల రూపాయల ప్యాకేజీని తెలంగాణ రాష్ట్రానికి అందజేయాలని కోరారు.రైతులు అధిక సంఖ్యలో పాల్గొని జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని కోరారు. నాగర్ కర్నూలు ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు చింతల నాగరాజు, వర్ధన్ సైదులు, వెంకటేష్ జగన్ ప్రజానాట్యపడాలి కళాకారు సుధాకర్ సరస్వతి, రాధమ్మ తదితరులు పాల్గొన్నారు.