రాప్తాడు బాలికకు అండగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి
రాప్తాడు బాలికకు అండగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
అనంతపురం రూరల్ మేజర్ న్యూస్ :రాప్తాడు నియోజకవర్గంలో ఇటీవల చోటుచేసుకున్న ఘటనలో గోపికను రక్షించే ప్రయత్నంలో గాయపడిన లక్ష్మిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరామర్శించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా లక్ష్మి కుటుంబానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.ఇందులో భాగంగా గురువారం రాప్తాడు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆసుపత్రికి వెళ్లి లక్ష్మి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున రూ.3 లక్షల ఆర్థిక సహాయాన్ని చెక్కు రూపంలో అందజేశారు.