BREAKING
పల్నాడు జిల్లాలో పంచాయతీఎన్నికలకు సర్వం సిద్ధం ఎస్పీ జగదీష్ ఆదహళ్లి కార్మికుల సమస్యలు పరిష్కరించకుంటే ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సమ్మెకు సిద్ధం అభివృద్ధి పనులలో పురోగతి సాధించాలి - జిల్లా కలెక్టర్ కె.హరిత నత్నయపల్లి నుండి పటాన్ చెరువ్యు వరకు బస్సు సౌకర్యం కల్పించాలి..డి ఎం కు వినతి పత్రం.... అర్హులందరికీ చేయూత పింఛన్లు - జిల్లా కలెక్టర్ కె. హరిత లైంగిక వేధింపుల ఫిర్యాదును స్వీకరించని రాజేంద్రనగర్ పోలీసులు : హేమా సుదర్శన్ దివ్యాంగ విద్యార్థులకు క్రీడా పోటీలు ప్రతిభను ప్రోత్సహిస్తూ.. విజేతలకు బహుమతుల ప్రదానం నగరం గ్రామంలో ఎల్ నినో పై గ్రామ సభ అండర్‌ 19 ఆసియా కప్‌ సెమీఫైనల్‌: అదరగొట్టిన భారత బౌలర్లు.. ఆఫ్ఘనిస్తాన్ ఎంత లక్ష్యమంటే? 21 సిక్సర్లతో కివీస్ యువ బ్యాటర్ విధ్వంసం.. లిస్ట్-ఏ క్రికెట్‌లో డబుల్ సెంచరీతో సరికొత్త చరిత్ర పవన్ కల్యాణ్ ఓజీ సినిమాపై క్రేజీ అప్‌డేట్.. మూడో భాగం కూడా రానుందంటూ తమన్ హింట్ కోటిలింగాల ఆలయ అభివృద్ధి గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి భారత్-న్యూజిలాండ్ నాలుగో వన్డే: తుదిజట్టు కూర్పుపై ఆకాష్ చోప్రా ఆసక్తికర జోస్యం అఖిల భారత కిసాన్ సభను జయప్రదం చేయండి _ నవంబర్ 15 నల్లగొండలో జాతీయ మహాసభలు ఓటీటీలో అగ్రస్థానంలో దూసుకుపోతున్న సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా ఇదే

ముఖ్యమంత్రి పర్యటనకు ఏర్పాట్లు పూర్తి చేయాలి జిల్లా కలెక్టర్ హైమావతి.

Select Suryaa Now
ముఖ్యమంత్రి పర్యటనకు ఏర్పాట్లు పూర్తి చేయాలి జిల్లా కలెక్టర్ హైమావతి.

సిద్దిపేట  ; ఈనెల 19వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి పాల్గొననున్న భారీ బహిరంగ సభను విజయవంతంగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ కె. హైమావతి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.గురువారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని నాగదేవత గుడి నుంచి సిరిసిల్లకు వెళ్లే బైపాస్ రోడ్డు వెంబడి సుమారు 15 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేస్తున్న బహిరంగ సభ ప్రాంగణాన్ని కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సభా వేదికతో పాటు వివిధ విభాగాల ఏర్పాట్ల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సభకు హాజరయ్యే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. వీఐపీలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు, మీడియా ప్రతినిధుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.వాహనాల పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణ, పోలీసు బందోబస్తు, ప్రజల రాకపోకలకు సంబంధించి ముందస్తు ప్రణాళిక రూపొందించాలని స్పష్టం చేశారు. ప్రత్యేక గ్యాలరీలు, బారికేడింగ్ ఏర్పాటు చేయడంతో పాటు విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా అవసరమైన ముందస్తు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు.సభకు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యే అవకాశం ఉన్నందున తాగునీరు, పారిశుద్ధ్యం, భద్రత, ఇతర మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ ఆదేశించారు.ఈ పరిశీలనలో సిద్దిపేట ఆర్డీవో సదానందం, తహసీల్దార్ కిరణ్, పోలీస్ శాఖ అధికారులు, రెవెన్యూ, ఆర్ అండ్ బి, విద్యుత్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.