BREAKING
సీనియర్ నేత, మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు కన్నుమూత బోందిడిలో దూడలకు నట్టల మందుల నివారణ పంపిణీ జిల్లాలో 8,209 మందికి కొత్తగా భృతి మంజూరు..ఈ నెల 19 నుంచి లబ్ధిదారుల ఖాతాల్లో భృతి నగదు జమ కొమురం భీమ్ మనుమడు మృతి బాధాకరం - ఎమ్మెల్యే కోవ లక్ష్మి బ్రహ్మాసముద్రం లో ఎన్నికలు ప్రశాంతంగా జరగాలి. ఎమ్మెల్యే అభివృద్ధి పనులను చూసి బీఆర్ఎస్‌లో చేరిన కుమారి ఉప సర్పంచ్, వార్డు సభ్యులు సర్వే విభాగం ఆధునికీకరణకు శ్రీకారం రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు యాటకలు విద్యార్థులు. అర్హులైన పేదలకు డబుల్ బెడ్‌రూం ఇండ్లు అందించేందుకు చర్యలు - జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా ప్రజలకు తాగునీటి ఇబ్బందులు లేకుండా తక్షణ చర్యలు చేపట్టాలి రేణిగుంటలో వైసీపీ నాయకులు, కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం వాల్ మార్ట్ వైస్ ప్రెసిడెంట్ తో లోకేష్ భేటీ జి. లింగాపురం ఎంపీటీసీ షాహిదాకు ఎమ్మెల్యే బుడ్డా ఆశీస్సులు పల్నాడు జిల్లాలో పంచాయతీఎన్నికలకు సర్వం సిద్ధం ఎస్పీ జగదీష్ ఆదహళ్లి కార్మికుల సమస్యలు పరిష్కరించకుంటే ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సమ్మెకు సిద్ధం

అయ్యప్ప స్వామి దేవస్థాన అభివృద్ధికి రూ.7 లక్షల విరాళం

Select Suryaa Now
అయ్యప్ప స్వామి దేవస్థాన అభివృద్ధికి రూ.7 లక్షల విరాళం

ఆమీన్ పూర్ మేజర్ న్యూస్ ;   ఆధ్యాత్మిక కార్యక్రమాలకు, దేవాలయాల అభివృద్ధికి తనవంతు సహకారం అందించడంలో ముందుండే బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, ఎండీఆర్ ఫౌండేషన్ కో-ఫౌండర్ మాద్రి పృథ్వీరాజ్ మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. పటాన్‌చెరు నియోజకవర్గం అమీన్‌పూర్ పరిధిలోని బీరంగూడలో నిర్మాణంలో ఉన్న శ్రీశ్రీశ్రీ అయ్యప్ప స్వామి దేవస్థాన అభివృద్ధికి రూ.7,00,116 (ఏడు లక్షల నూట పదహారు రూపాయలు) భారీ విరాళాన్ని అందజేశారు.ఈ నెల 22న నిర్వహించనున్న శ్రీశ్రీశ్రీ అయ్యప్ప స్వామి వారి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాన్ని పురస్కరించుకుని పృథ్వీరాజ్ దేవస్థానాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులతో సమావేశమై దేవస్థాన నిర్మాణ పనులు, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రతిష్ఠా మహోత్సవ ఏర్పాట్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు.అనంతరం దేవస్థానంలో ద్వారపాలకుల మండపం నిర్మాణం కోసం రూ.7,00,116 విరాళాన్ని ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు. దేవస్థాన అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావడం తనకు ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, ఆధ్యాత్మిక విలువలకు దేవాలయాలు ప్రతీకలని అన్నారు. దేవాలయాలు కేవలం ప్రార్థనా మందిరాలే కాకుండా భక్తి, ఐక్యత, సేవాభావం, సామాజిక సమైక్యతను పెంపొందించే పవిత్ర కేంద్రాలని వివరించారు. దేవాలయాల పరిరక్షణ, అభివృద్ధి ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యతగా భావించాలని, ధార్మిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు భక్తులు, దాతలు తమవంతు సహకారం అందించాలని పిలుపునిచ్చారు. భవిష్యత్తులోనూ దేవాలయాల అభివృద్ధికి, సేవా కార్యక్రమాలకు తన సహకారం కొనసాగిస్తానని తెలిపారు.

పృథ్వీరాజ్‌కు ఆలయ కమిటీ ఘన సన్మానం..

దేవస్థాన అభివృద్ధికి ఉదారంగా రూ.7,00,116 విరాళం అందించిన మాద్రి పృథ్వీరాజ్‌ను ఆలయ కమిటీ సభ్యులు శాలువాతో ఘనంగా సత్కరించారు. ఆయన అందించిన విరాళం దేవస్థాన అభివృద్ధి పనులకు ఎంతో ఉపయోగపడుతుందని కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు, ప్రముఖులు, అయ్యప్ప స్వామి భక్తులు, ఎంఆర్‌పీఆర్ యువసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు.