BREAKING
ప్రపంచ ఆర్థిక వృద్ధి రేటు 2.6 శాతానికి మందగమనం: రాంపూర్ గ్రామంలో దుర్గాదేవికి ఘనంగా తొలిపూజ రష్యా-ఉక్రెయిన్ 'ఇంధన కాల్పుల విరమణ'పై ట్రంప్ ప్రకటన: స్వాగతించిన జెలెన్‌స్కీ.. సూడాన్-ఈజిప్ట్ సరిహద్దులోని బంగారు గనిపై భీకర వైమానిక దాడి: 72 మంది కార్మికులు దుర్మరణం! చైనా యువతను ఆకట్టుకుంటున్న 'డిజిటల్ ఇబుప్రోఫెన్': పని ఒత్తిడి, అనిశ్చితిని దూరం చేసే సరికొత్త ట్రెండ్! లాభాల్లో ప్రారంభం కానున్న భారత స్టాక్ మార్కెట్లు మలేషియా ప్రభుత్వంతో ఎయిర్‌ఏషియా చర్చలు మాజీ విప్ గంగుల దంపతులను సత్కరిస్తున్న కాళికామాత ఆలయ కమిటీ ఇండోనేషియాలో శక్తివంతమైన భూకంపం ముంబై సమీపంలో అమెజాన్ మెగా డేటా సెంటర్‌పై స్థానికుల నిరసనలు: నీరు, విద్యుత్ కొరత, శబ్ద కాలుష్యంపై తీవ్ర ఆందోళనలు! ఏఐ నియంత్రణకు 'ఎమర్జెన్సీ బ్రేక్' తప్పనిసరి: మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల సంచలన పిలుపు! జిబౌటి తీరంలో ఘోర పడవ ప్రమాదం: 109 మంది మృతి, 116 మంది గల్లంతు! అక్టోబర్‌లో ఐపీవోల వెల్లువ: జియో ప్లాట్‌ఫామ్స్, జెట్‌వర్క్‌ సహా డజనుకు పైగా కంపెనీలు పబ్లిక్ ఇష్యూకి సిద్ధం! ఆదివారం సెలవు అయినా మానవత్వానికి మరో నిదర్శనం – పోలవరం ఎమ్మెల్యే చిర్రి దేవి నవరాత్రి సందర్భంగా నసనకోట ముత్యాలమ్మకు ప్రత్యేక పూజలు.. ఆలయ ఈవో వెంకటేశ్వర్లు

గాయత్రీదేవి అలంకారంలో కనకదుర్గమ్మ దర్శనం

Select Suryaa Now
గాయత్రీదేవి అలంకారంలో కనకదుర్గమ్మ దర్శనం

ఇంద్రకీలాద్రి, మేజర్ న్యూస్ : దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో రెండో రోజైన సోమవారం జగన్మాత శ్రీ కనకదుర్గమ్మవారు వేదమాత శ్రీ గాయత్రీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. వేకువజామున 4 నుంచి 5 గంటల వరకు నూతన పూజా మండపంలో ప్రత్యేక దేవీ ఖడ్గమాలార్చన శాస్త్రోక్తంగా నిర్వహించగా, ఉదయం 6 గంటలకు తొలి విడత విశేష కుంకుమార్చన పూజలు ప్రారంభమయ్యాయి. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రశాంత వాతావరణంలో అమ్మవారి దర్శనం కల్పిస్తున్నారు. విజయవాడ నగరపాలక సంస్థ, దేవస్థానం సమన్వయంతో వినాయక ఆలయం నుంచి క్యూలైన్లలో నిరంతర మంచినీటి సరఫరా, ఉచిత సామగ్రి భద్రపరిచే గది, పాదరక్షల స్టాండ్లను అందుబాటులో ఉంచారు. మహామండపం ప్రాంగణంలో ఉచిత ప్రసాద వితరణ కొనసాగుతుండగా, కనకదుర్గా నగర్‌లో భక్తులకు లడ్డూ ప్రసాదాలు అందించేందుకు విస్తృతంగా కౌంటర్లు ఏర్పాటు చేశారు. ప్రత్యేక పూజల్లో పాల్గొనే భక్తుల కోసం కుమ్మరిపాలెం సెంటర్ నుంచి కొండపైకి ఉచిత వాహనాలు నడుపుతున్నారు. పూజలు, దర్శనం అనంతరం రథం సెంటర్ ఫుట్‌ బ్రిడ్జి అవతల కెనాల్‌ రోడ్డు వద్ద నుంచి తిరిగి కుమ్మరిపాలెం చేరుకునేందుకు వాహనాలు సిద్ధంగా ఉంచారు. సమాచార కేంద్రాలు, మైక్‌ ప్రచారం ద్వారా భక్తులకు ఎప్పటికప్పుడు సేవల వివరాలను తెలియజేస్తున్నారు.