గాయత్రీ దేవి అలంకారంలో వాసవీ అమ్మవారు
జంగారెడ్డిగూడెం- సూర్య న్యూస్ పట్టణంలోని శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో నిర్వహిస్తున్న 23వ దసరా మహోత్సవాల్లో భాగంగా రెండో రోజు అమ్మవారు శ్రీ గాయత్రీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించగా, భక్తులు భక్తిశ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.అమ్మవారి అలంకరణకు, చీరకు జంగారెడ్డిగూడెంలోని శ్రీ దామోదర్ క్లాత్స్ వారు దాతలుగా వ్యవహరించారు. ప్రసాద పంపిణీ కార్యక్రమానికి ఇమ్మడి రమేష్ (భాస్కర్ ట్రావెల్స్) దంపతులు, భూమా గోపాలరావు దంపతులు సహకరించారు.ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో గార్లపాటి నాగ రామారావు దంపతులు, మహంకాళి అరుణ్ గుప్తా దంపతులు పాల్గొన్నారు. అమ్మవారిని తడికిమళ్ల దుర్గారావు, చిట్లూరి దామోదరరావు, పైడి రమేష్, పులవర్తి సురేష్, తిరువీధి వేణుగోపాల్, గుళ్లపూడి మురళీకృష్ణ, కొలాటి కృష్ణారావు, కంచర్ల గణేష్, రేపాక జగన్మోహన్‌రావు తదితరులు దర్శించుకున్నారు.
రిపోర్టర్: కెవి రమణ రావు జంగారెడ్డిగూడెం ఏలూరు జిల్లా,