andhrapradesh
ఏపీ మున్సిపల్ కౌంటింగ్ ట్రెండ్స్: కూటమి అభ్యర్థుల హవా
అమరావతి:ఆంధ్రప్రదేశ్‌లోని పట్టణ స్థానిక సంస్థల (మున్సిపల్) ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటివరకు వెలువడిన ప్రారంభ కౌంటింగ్ ట్రెండ్స్‌లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ (కూటమి) అభ్యర్థులు స్పష్టమైన ఆధిపత్యం ప్రదర్శిస్తున్నారు.
లెక్కింపు వివరాల ప్రకారం, మొత్తం 13 మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో తెలుగుదేశం పార్టీ 7 చోట్ల, జనసేన ఒక చోట ముందంజలో ఉన్నాయి. ఇక 87 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలలో తెలుగుదేశం 39 చోట్ల, జనసేన 7 స్థానాల్లో, బీజేపీ ఒక చోట లీడ్‌లో కొనసాగుతున్నాయి.
వార్డుల వారీగా చూస్తే, మొత్తం 3,020 వార్డుల పరిధిలో తెలుగుదేశం అభ్యర్థులు 600 వార్డుల్లో, జనసేన 26, వైఎస్సార్‌సీపీ 21, బీజేపీ 13 వార్డుల్లో ఆధిక్యంలో ఉన్నారు. సాయంత్రానికి పూర్తి స్థాయి ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.