ఎన్నికల మెటీరియల్ కేంద్రాన్ని పరిశీలించిన ఆర్డీవో పావని
ఆత్మకూరు, మేజర్ న్యూస్ : మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఆత్మకూరు పట్టణంలోని ఆంధ్ర ఇంజనీరింగ్ కళాశాలలో ఎన్నికల పోలింగ్ సిబ్బందికి ఎన్నికల సామాగ్రి పంపిణీ చేసే కేంద్రాన్ని ఆత్మకూరు ఆర్డీవో భూమి రెడ్డి పావని శనివారం పరిశీలించారు. ఆదివారం మున్సిపల్ ఎన్నికల పోలింగ్ జరుగనున్న విషయం విధితమే. అన్నీ ఏర్పాట్లు పూర్తికాగా ఆంధ్రా ఇంజనీరింగ్ కాలేజీ లో సిబ్బందికి పోలింగ్ మెటీరియల్ పంపిణీ చేయగా ఆర్డీవో పావని నిసితంగా పరిశీలించారు. సిబ్బందికి ఆమె పలు సూచనలు చేశారు.