BREAKING
ఖండవల్లిలో కూటమి జడ్పీటీసీ అభ్యర్థి ఇంటింటా ఎన్నికల ప్రచారం రూ.195 కోట్లతో నిడదవోలు పట్టణాభివృద్ధి:మంత్రి కందుల దుర్గేష్ ఎస్ జి ఎఫ్ రాష్ట్ర స్థాయి హాకీ పోటీలకు పందలపాక విద్యార్థులు ఎంపిక జనసేన పార్టీ నుండి వైయస్సార్ పార్టీలో చేరికలు నేటి పంచాంగం 26 అక్టోబర్ 2026 నేటి రాశి ఫలాలు –26 అక్టోబర్ 2026 అంబాజీపేటలో శ్రీ విజయ భేతాళస్వామి వాహన మహోత్సవం.. గుగులోతు రామస్వామి నాయక్ కు ఘన సన్మానం అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకోవాలి-డిసిసి ప్రధాన కార్యదర్శి శ్రీపాల్ రెడ్డి ప్రమాదవశాత్తు నిప్పంటుకొని వృద్ధురాలికి తీవ్ర గాయాలు గంజాయి రవాణా చేస్తున్న మహారాష్ట్ర పోలీస్ కానిస్టేబుల్-ఆరు లక్షల విలువైన 12 కిలోల గంజాయి పట్టివేత సాయినగర్ కాలనీలో ఎమ్మెల్సీ పట్టభద్రుల ఓటరు నమోదు ఎన్‌టీఆర్‌ నగర్‌లో కిడ్నాప్‌ కలకలం.... గంటల్లోనే కిడ్నాప్‌నకు గురైన వ్యక్తిని గుర్తించిన గచ్చిబౌలి పోలీసులు . జీహెచ్‌ఎంసీ మహిళా కార్మికులకు చీరల పంపిణీ చేసిన బలరాం యాదవ్ పట్టభద్రులు ఓటర్లుగా నమోదు కావాలి: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు

ఎన్ని గ్రూపులున్నా మనది ఒకటే గ్రూప్.. అది టీడీపీ గ్రూప్: ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి

Select Suryaa Now
ఎన్ని గ్రూపులున్నా మనది ఒకటే గ్రూప్.. అది టీడీపీ గ్రూప్: ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి

నెల్లూరు,  మేజర్ న్యూస్ :   పార్టీలో ఎన్ని గ్రూపులున్నా చివరికి ఉండేది ఒకటే గ్రూప్ అని, అది ఎమ్మెల్యే గ్రూప్, తెలుగుదేశం పార్టీ, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు  గ్రూప్ అని కోవూరు శాసనసభ్యులు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి  స్పష్టం చేశారు. శనివారం నెల్లూరులోని వీపీఆర్‌ కార్యాలయంలో ఇందుకూరుపేట మండల నాయకులతో స్థానిక సంస్థల ఎన్నికలపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇందుకూరుపేట జడ్పీటీసీ అభ్యర్థిగా కూటమి తరఫున బరిలో నిలిచిన పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి ని అత్యంత భారీ మెజారిటీతో గెలిపించాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డితో పాటు పలువురు స్థానిక నాయకులు పాల్గొన్నారు.

ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అభ్యర్థి ఎంపిక 
ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు  ఆదేశాల మేరకు శ్రీనివాసులు రెడ్డి ని జడ్పీటీసీ అభ్యర్థిగా నిలబెట్టామని ఎమ్మెల్యే గారు తెలిపారు. ఆయన గురించి అందరికీ తెలుసని, రెండుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఆయనకు జడ్పీటీసీగా గెలవడం కష్టమేమీ కాదని అన్నారు. అయినప్పటికీ స్థానిక నాయకులందరూ కలిసికట్టుగా పనిచేసి, అత్యంత భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని కోరారు.  ఎన్ని గ్రూపులున్నా.. ఒక్కటే గ్రూప్ ప్రతి ఊరిలోనూ రెండు, మూడు గ్రూపులు ఉండటం సహజమని, అయితే ఎన్ని గ్రూపులున్నా చివరికి ఉండేది ఒకే గ్రూప్ అని ఎమ్మెల్యే  అన్నారు. అది ఎమ్మెల్యే గ్రూప్, తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు  గ్రూప్ అని, ఈ విషయాన్ని గుర్తుంచుకుని అందరూ ఐక్యంగా పనిచేసి శ్రీనివాసులు రెడ్డి ని గెలిపించాలని పిలుపునిచ్చారు.

ఉపసంహరణల తర్వాత ప్రచారం.. ముందుగానే ప్రణాళిక   నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసిన తర్వాత ప్రచారం ప్రారంభిస్తామని ఎమ్మెల్యే గారు తెలిపారు. ఆలోపు ముఖ్య నేతలు, స్థానిక నాయకులు, మండల పార్టీ అధ్యక్షులు కూర్చొని ప్రణాళికాబద్ధంగా కార్యాచరణ రూపొందించుకోవాలని సూచించారు.