ఎమ్మెల్యేను సత్కరించిన లంకమ్మ ప్రసాద్
ఎమ్మెల్యే బుద్ధప్రసాద్‌ను సత్కరించిన లంకమ్మ ప్రసాద్
అవనిగడ్డ, మేజర్ న్యూస్: జనసేన పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల సమన్వయ కమిటీలో నిర్వాహక దళ్ సభ్యునిగా నియమితులైన సందర్భంగా అశ్వారావుపాలెం మాజీ సర్పంచ్, జనసేన నాయకుడు పండ్రాజు లంకమ్మ ప్రసాద్ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్‌ను సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా లంకమ్మ ప్రసాద్ మాట్లాడుతూ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ మార్గదర్శకత్వంలో, మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గ జనసేన సమన్వయకర్త మండలి వెంకట్రామ్ నాయకత్వంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘన విజయం సాధించేందుకు సమిష్టిగా కృషి చేస్తానని తెలిపారు. అజంతా శ్రీనివాస్, అవనిగడ్డ , కృష్ణాజిల్లా.