BREAKING
దీక్ష దివస్ కార్యక్రమానికి బయలుదేరిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కొత్త ప్రభాకర్‌రెడ్డి చేతుల మీదుగా.. * టీఆర్‌ఆర్‌ఎస్‌ మహాసభ పోస్టర్ ఆవిష్కరణ.. ఘనంగా పోచమ్మ,ఎల్లమ్మ దేవాలయాల గడప నిర్మాణం కార్యక్రమం లక్షలు వెచ్చించి లక్షణంగా వదిలేశారు...... * సంవత్సరాలు గడుస్తున్న ప్రారంభానికి నోచుకోని హెల్త్ సెంటర్ భవనం బోరు మోటార్, దొంగల అరెస్ట్ మోటార్, కేబుల్ వైర్, పల్సర్ బైక్ స్వాధీనం పలుశుభ కార్యక్రమాలకు హాజరైన గ్రామ సర్పంచ్ బండారి లక్ష్మి & బాలరాజు కరీంనగర్‌లో దీక్షా దివస్ సభకు కదిలిన గుండారెడ్డిపల్లి గులాబీ దండు కోహెడ జూనియర్ క్రికెట్ జట్టుకు ఘన సన్మానం ముద్ర రుణం.. బ్యాంకు వసూళ్ల వేధింపులు! కేసీఆర్ నిరాహార దీక్ష.. తెలంగాణకు విజయదీక్ష! కేసీఆర్ దీక్షతోనే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి కీలక మలుపు! రామానుజ పల్లి సర్పంచ్ గా పొట్టేలి సుధా మరో అవకాశం.. నేడు కూడా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ అంతరాత్మకు కట్టుబడి నిష్పక్షపాతంగా తీర్పులు వెలువరించాలి కౌంటింగ్ కేంద్రాల వద్ద అప్రమత్తంగా ఉండాలి: జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు

ఏకగ్రీవ సర్పంచ్, వార్డు సభ్యులకు ఎమ్మెల్యే ఎంజీఆర్ సన్మానం

Select Suryaa Now
ఏకగ్రీవ సర్పంచ్, వార్డు సభ్యులకు ఎమ్మెల్యే ఎంజీఆర్ సన్మానం


గ్రామాల అభివృద్ధికి ఏకగ్రీవ ఎన్నికలు దోహదపడతాయి: ఎమ్మెల్యే

మెలియాపుట్టి. నవంబర్ 28. మేజర్ న్యూస్...

గ్రామాల అభివృద్ధి, ప్రజల మధ్య ఐక్యత, పరస్పర సహకారానికి ఏకగ్రీవ ఎన్నికలు దోహదపడతాయని పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అన్నారు. శనివారం పాతపట్నం ఎమ్మెల్యే కార్యాలయంలో మెలియాపుట్టి మండలం గోకర్ణపురం గ్రామ పంచాయతీకి ఏకగ్రీవంగా ఎన్నికైన నూతన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులను ఆయన ఘనంగా సన్మానించారు.
గోకర్ణపురం గ్రామ సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన హనుమంతు అరుణకుమారి తరఫున ప్రతినిధి హనుమంతు శ్రీధర్, ఉప సర్పంచ్‌గా ఎన్నికైన శనాపతి రవికుమార్‌తో పాటు నూతనంగా ఎన్నికైన వార్డు సభ్యులను ఎమ్మెల్యే శాలువాలతో సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా నూతన ప్రజాప్రతినిధులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఏకగ్రీవంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులపై గ్రామస్థులు ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని సూచించారు. రాజకీయాలకు అతీతంగా గ్రామ ప్రజలందరినీ కలుపుకొని గ్రామాభివృద్ధికి కృషి చేయాలని కోరారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన, తాగునీరు, రహదారులు, పారిశుధ్యం వంటి ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా కృషి చేయాలని సూచించారు.
ప్రజలు తమపై ఉంచిన విశ్వాసానికి అనుగుణంగా బాధ్యతాయుతంగా పనిచేస్తూ గోకర్ణపురం పంచాయతీని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షించారు. గ్రామాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రజాప్రతినిధులకు అవసరమైన సహకారం అందిస్తామని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు.