డ్రగ్స్ రహిత సమాజస్థాపనకు కృషిచేయాలి
-ఎస్ఐ వెంకటేశ్వరరెడ్డి:సిఎస్ పురం,మేజర్ న్యూస్: సమాజంలో ప్రతిఒక్కరు మాదకద్రవ్యాల పట్ల అప్రమత్తంగా ఉండి డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి కృషిచేయాలని యస్ఐ పి.వెంకటేశ్వరరెడ్డి అన్నారు.శుక్రవారం మండలకేంద్రమైన సిఎస్ పురం పియంశ్రీ జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో మాదకద్రవ్యాల వలన కలిగే నష్టాలు డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈసందర్భంగా ఎస్ఐ,పలువురు మాట్లాడుతూ నేటి యువత మత్తు పదార్థాలు అలవాటు చేసుకోకుండా దూరంగా ఉండాలని మాదకద్రవ్యాల వలన ఆరోగ్యం దెబ్బతిని రోగాల బారిన పడి ఇబ్బందులు పడవలసి వస్తుందని అంతేకాకుండా సమాజంలో విలువ లేకుండా పోతుందని నేటి యువత విద్యార్థులతో నవసమాజ నిర్మాణం జరగాలని అందుకోసం సమాజంలో మత్తు పదార్ధాలను పూర్తిగా నిర్మూలించి డ్రగ్స్ రహిత సమాజస్థాపనకు ప్రతిఒక్కరు కృషిచేయాలని అన్నారు.ఈసందర్భంగా విద్యార్థులు దసరా సెలవుల సందర్భంగా గ్రామాల్లో చెరువులు కుంటల వద్దకు వెళ్లవద్దని ఇంటివద్దనే ఉండాలని బాగా చదువుకుని మంచి ఫలితాలు సాధించాలని యస్ఐ విద్యార్థులకు సూచించారు.ఈసందర్భంగా డ్రగ్స్ వలన జరిగే ఆరోగ్య నష్టాలు గురించి పోస్టర్లు అవిష్కరించారు.ఈకార్యక్రమంలో యస్ఐ వెంకటేశ్వరరెడ్డి,ఎంఇఓలు జె.ప్రసాదరావు,బి.డేవిడ్,ప్రధానోపాధ్యాయురాలు షేక్ ఖాదరున్నిసాబేగం,ఉపాధ్యాయులు,విద్యార్థులు ఉన్నారు.