BREAKING
దీక్ష దివస్ కార్యక్రమానికి బయలుదేరిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కొత్త ప్రభాకర్‌రెడ్డి చేతుల మీదుగా.. * టీఆర్‌ఆర్‌ఎస్‌ మహాసభ పోస్టర్ ఆవిష్కరణ.. ఘనంగా పోచమ్మ,ఎల్లమ్మ దేవాలయాల గడప నిర్మాణం కార్యక్రమం లక్షలు వెచ్చించి లక్షణంగా వదిలేశారు...... * సంవత్సరాలు గడుస్తున్న ప్రారంభానికి నోచుకోని హెల్త్ సెంటర్ భవనం బోరు మోటార్, దొంగల అరెస్ట్ మోటార్, కేబుల్ వైర్, పల్సర్ బైక్ స్వాధీనం పలుశుభ కార్యక్రమాలకు హాజరైన గ్రామ సర్పంచ్ బండారి లక్ష్మి & బాలరాజు కరీంనగర్‌లో దీక్షా దివస్ సభకు కదిలిన గుండారెడ్డిపల్లి గులాబీ దండు కోహెడ జూనియర్ క్రికెట్ జట్టుకు ఘన సన్మానం ముద్ర రుణం.. బ్యాంకు వసూళ్ల వేధింపులు! కేసీఆర్ నిరాహార దీక్ష.. తెలంగాణకు విజయదీక్ష! కేసీఆర్ దీక్షతోనే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి కీలక మలుపు! రామానుజ పల్లి సర్పంచ్ గా పొట్టేలి సుధా మరో అవకాశం.. నేడు కూడా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ అంతరాత్మకు కట్టుబడి నిష్పక్షపాతంగా తీర్పులు వెలువరించాలి కౌంటింగ్ కేంద్రాల వద్ద అప్రమత్తంగా ఉండాలి: జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు

డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల పోలింగ్ సామగ్రి పంపిణీ.

Select Suryaa Now
డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల పోలింగ్ సామగ్రి పంపిణీ.

వంగర నవంబర్ 28 మేజర్ న్యూస్​ గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. గ్రామాల్లోపోలింగ్‌ కేంద్రాలకు ఎన్నికల విధులకు కేటాయించిన ప్రిసైడింగ్ అధికారులు , సహాయ ప్రిసైడింగ్ అధికారులు  మరియు ఇతర పోలింగ్ సిబ్బంది శనివారం ఎన్నికల సామగ్రితో తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు బయలుదేరారు.  
​మండల కేంద్రంలోని డిస్ట్రిబ్యూషన్ (పంపిణీ) కేంద్రం వద్ద ఉదయం నుంచే ఎన్నికల సందడి నెలకొంది. రిటర్నింగ్ అధికారుల పర్యవేక్షణలో సిబ్బందికి బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పత్రాలు, ఓటర్ల జాబితా, చెరగని సిరా , స్టాంపులు, కవర్లు, మరియు ఇతర స్టేషనరీ సామగ్రిని పంపిణీ చేశారు. సామగ్రిని అందుకున్న సిబ్బంది, తమకు ఇచ్చిన కిట్‌లో అన్నీ సక్రమంగా ఉన్నాయో లేదో ఒకటికి రెండుసార్లు క్షుణ్ణంగా తనిఖీ చేసుకున్నారు. సామగ్రి పంపిణీ ప్రక్రియ పూర్తయిన అనంతరం, పటిష్టమైన పోలీసు బందోబస్తు నడుమ ప్రత్యేక వాహనాలు, ఆర్టీసీ బస్సుల్లో సిబ్బందిని ఆయా గ్రామాల పోలింగ్ కేంద్రాలకు తరలించారు.
పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న వెంటనే అక్కడి ఏర్పాట్లను పరిశీలించాలని, ఓటర్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా క్యూలైన్లు, తాగునీరు, విద్యుత్, మరియు ఓటు రహస్యతకు భంగం కలగకుండా కంపార్ట్‌మెంట్లను సిద్ధం చేసుకోవాలని ఉన్నతాధికారులు సిబ్బందికి సూచించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్నికల సక్రంగా  ప్రశాంత వాతావరణంలో పోలింగ్ నిర్వహించాలని ఆదేశించారు.  
​