BREAKING
కూటమి అభ్యర్థుల విజయానికి సమన్వయంతో పనిచేస్తాం. ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ లలిత కళాపరిషత్ లో డిప్యూటీ మేయర్ టి. స్వాతికి ఘనసత్కారం.. సమాచార హక్కు చట్టంపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలి : రాయపూడి ని పరామర్శించిన మండలి వెంకట్రామ్ అనంతలో సండేస్ ఆన్ సైకిల్ 100వ ఎడిషన్.. భారీగా పాల్గొన్న విద్యార్థులు క్రీడాకారులు భక్తులకు వాటర్ బాటిళ్ల పంపిణీ.. కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు కృషి చేయాలి మనవరాలి పట్టుబట్టడంతో థియేటర్లో రామాయణం చూసిన అమిత్ షా.. సినిమాపై ప్రశంసల వర్షం రెండో విడతలోనూ టీడీపీ హవా! పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం సద్వినియోగం చేసుకోవాలి దేవునిపల్లి రథోత్సవంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ విజయరమణ రావు రెండో విడతలోనూ కొనసాగిన తొలివిడత ఒరవడి.. ఘనంగా సూఫీ అభిషిక్తులు.. పుస్తక పఠనం విజ్ఞానానికి ఎంతో మేలు యూనివర్సిటీ వేదికపై అసభ్య ప్రవర్తన.. ప్రముఖ యూట్యూబర్ భువన్ బామ్‌పై కేసు నమోదు

దర్శిలో మహాత్మ పూలే కు ఘన నివాళి.

Select Suryaa Now
దర్శిలో మహాత్మ పూలే కు ఘన నివాళి.

దర్శిలో మహాత్మ పూలేకు ఘన నివాళి

దర్శి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మహాత్మ జ్యోతిరావు పూలే 136వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. దర్శి నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్ ఆదేశాల మేరకు 15వ వార్డు కౌన్సిలర్, బీసీ యువ నాయకుడు వాడపల్లి సైదావలి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.

ఈ సందర్భంగా కౌన్సిలర్ సైదావలి మాట్లాడుతూ.. సమాజంలో కులవివక్ష, అసమానతల నిర్మూలనకు జీవితాన్ని అంకితం చేసిన గొప్ప సంఘసంస్కర్త మహాత్మ జ్యోతిరావు పూలే అని కొనియాడారు. మహిళలు, అణగారిన వర్గాలకు విద్య అందించేందుకు ఆయన చేసిన కృషి చిరస్మరణీయమన్నారు. విద్యతోనే సమాజంలో మార్పు సాధ్యమని చాటిచెప్పిన పూలే ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. అనంతరం కౌన్సిలర్ సైదావలి ఆధ్వర్యంలో 15వ వార్డులోని పేదలకు నిత్యవసర సరుకులను పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షుడు నారాయణ, వార్డు ఉపాధ్యక్షుడు హుస్సేన్, శీను, మాబు, కాసిం, వంశి, మదర్ వలి తదితరులు పాల్గొన్నారు.