BREAKING
బిసి రెసిడెన్షియల్ కళాశాలలో విద్యార్థుల ఆరోగ్యంపై వైద్య బృందం పర్యవేక్షణ ఇరాన్‌తో యుద్ధం కోసం లాజెస్ వైమానిక స్థావరం వాడకంపై ప్రాసిక్యూటర్ల దర్యాప్తు ప్రజా ప్రయోజనమే జర్నలిజం ప్రధాన లక్ష్యం -వృత్తిలో నైపుణ్యాలను పెంపొందించుకోవాలి సిఆర్ మీడియా అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ కుమార్ ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధులు పాత్రికేయులు : ఎమ్మెల్యే పులివర్తి నాని శరీరంలో తరచూ వచ్చే ఆరోగ్య సమస్యలకు అసలు కారణాలు ఇవే.. నిపుణులు ఏం చెబుతున్నారు? శ్రీనివాసస్కూల్లోసరికొత్తబియ్యాంసేకరణ నెట్‌ఫ్లిక్స్‌లో ట్రెండ్ అవుతున్న సస్పెన్స్ థ్రిల్లర్ సిరీస్.. షక్ ట్రస్ట్ నో వన్ స్టోరీ ఇదే స్పానిష్‌ గడ్డపై హోరెత్తిన నిరసనల హోరు రెసిడెన్షియల్ విద్యాసంస్థల్లో విద్యార్థుల భద్రత, సౌకర్యాలకు ప్రాధాన్యత. జిల్లా కలెక్టర్ పామూరు పంచాయతీకి స్వచ్ఛ ఆంధ్ర అవార్డు అడవిలో తలలేని శవం.. ఊహించని ట్విస్టులతో ఓటీటీలో ట్రెండ్ అవుతున్న క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ మట్టి తవ్వకాలను అడ్డుకున్న గ్రామస్తులు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ముందస్తు ప్రణాళికతో ఏర్పాట్లు మెగాస్టార్, విక్టరీ వెంకటేష్‌లతో చిందేసిన ఈ భామ ఎవరో తెలుసా.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న సుందరి 97 కేజీల విభాగంలో కాంస్యం గెలుచుకున్న దీపక్ పునియా పేదరిక నిర్మూలన, ఆర్థిక అసమానతలను తగ్గించడమే ప్రధాన లక్ష్యంగా పనిచేయాలి* *జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి*

చెరువులను నీటి తో నింపే ప్రక్రియను త్వరగా పూర్తి చేయండి*

Select Suryaa Now
చెరువులను నీటి తో నింపే ప్రక్రియను త్వరగా పూర్తి చేయండి*

 


*చెరువులను నీటి తో నింపే ప్రక్రియను త్వరగా పూర్తి చేయండి*

*త్రాగు నీటి పనులకు ప్రాముఖ్యత ఇవ్వండి*

*హెల్త్ క్లినిక్స్ , అంగన్వాడి భవనాలు , సిసి రోడ్ల పనులు త్వరగా పూర్తి చేయండి*


*జిల్లా పరిషత్ ప్రత్యేక అధికారి /జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి*


కర్నూలు ,అక్టోబర్ 3 :- జిల్లాలోని చెరువులను అన్నింటిని నీటితో నింపే ప్రక్రియలు త్వరగా పూర్తి చేయాలని, హెల్త్ క్లినిక్స్ , అంగన్వాడి భవనాలు , సిసి రోడ్ల పనులు త్వరగా పూర్తి చేయండి అని జిల్లా పరిషత్ ప్రత్యేక అధికారి/జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి కలెక్టరేట్ లో జరిగిన  సమావేశంలో అధికారులను ఆదేశించారు.

శనివారం ఉదయం జిల్లా పరిషత్ ప్రత్యేక అధికారి /జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి జిల్లా పరిషత్ ఆధ్వర్యంలో జరిగే వివిధ పనులపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... జిల్లాలోని త్రాగునీటి పనులకు అత్యంత ప్రాముఖ్యత ఇవ్వాలని , వాటికి సంబంధించిన పనులు వెంటనే పూర్తి చేయాలని అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. హంద్రీనీవా నీటి ప్రవాహం మరియొక పది రోజులు , ఎల్ఎల్సీ నీటి ప్రవాహం నవంబర్ 10 వ తారీకు వరకు ఉండే అవకాశాలు ఉన్నందున జిల్లాలోని చెరువులను వెంటనే నింపాలని ఆదేశించారు. 35 నీటి చెరువులలో ఇంకా 18 చెరువులు వివిధ నీటి స్థాయి 75 శాతం-11, 50 శాతం -5 మరియు 25 శాతం-2 లలో  ఉన్నవని వీటిని కూడా పూర్తిస్థాయిలో నింపడం పూర్తిచేయాలని , అందుకు కావలసిన  చర్యలు తీసుకోవాలని , బోర్వెల్ లను లోతుగా డ్రిల్ చేసే పనులను , ఫిల్టర్లను మార్చే ప్రక్రియ మరియు సిసి డ్రైన్స్ ల పనులను వెంటనే పూర్తి చేయాలని  ఆర్డబ్ల్యూఎస్ ఎస్.ఈ మనోహర్ ను ఫోన్ ద్వారా ఆదేశించారు.


జిల్లా వ్యాప్తంగా ఉన్న అతి ముఖ్యమైన పెండింగ్ పనులు హెల్త్ క్లినిక్స్ , అంగన్వాడి భవనాలు , సిసి రోడ్ల పనులు, టాయిలెట్స్ మొదలగు నవి త్వరగా పూర్తి చేయమని , అందుకు కావలసిన అనుమతులు తీసుకోవాలని , పనులు కూడా కాంట్రాక్టర్లు వెంటనే పూర్తి చేసే చర్యలు తీసుకోవాలని సంబందించిన అధికారులను ఆదేశించారు.


జిల్లాకు ఇంకా రావలసిన 15వ ఫైనాన్స్ కమిషన్ మరియు 16వ ఫైనాన్స్ కమిషన్ నిధులు రాబట్టడానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.


ఈ సమావేశంలో  జిల్లా పరిషత్ సీఈవో సుధాకర్ రెడ్డి , పంచాయతీరాజ్ ఎస్.ఈ చంద్రా రెడ్డి ,పి.ఆర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శివసాగర్ రెడ్డి,ఆర్డబ్ల్యూఎస్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అబ్దుల్ ఖాదర్, జిల్లా పరిషత్ సూపరింటెండెంట్ జితేంద్ర , డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ శ్రీధర్ మూర్తి పాల్గొన్నారు. ఎస్.ఈ. ఆర్డబ్ల్యూఎస్ మనోహర్ టెలికాన్ఫ్రెన్స్ ద్వారా సమావేశంలో పాల్గొన్నారు.