BREAKING
ఓటు చోరీకి వ్యతిరేకంగా ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ భారీ నిరసన–ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాటం కొనసాగిస్తాం ఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి కొడుకు పుట్టినరోజు వేడుకల్లో సేవా కార్యక్రమం.. బాల బాలికలకు సైకిళ్ల పంపిణీ నాగాపూర్ గ్రామంలో ఉచిత వైద్య శిబిరం భైరవి హెల్ప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వైద్య సేవలు ఇండియా కూటమి నిరసన కార్యక్రమానికి కోహిర్ కాంగ్రెస్ నేత ముజఫర్ హుస్సేన్ హాజరు అమీన్పూర్ లో గుట్టు రట్టైన మత్తు వ్యాపారం ఎండిఎంఏ 10.50.. రెండు ఫోన్లు స్వాధీనం ఇద్దరు నిందితులను రిమాండ్ కు తరలింపు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి ఎన్నికలు నిర్వహించడం చంద్రబాబు నియంతృత్వానికి నిదర్శనం సిద్దేశ్వరాలయంలో ఉజ్జయిని జగద్గురు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు బీఆర్ఎస్ సర్పంచులను అవమానిస్తే సహించేది లేదు.. ఆందోళన చేపడతాం: మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి వైకాపాను ఆదరించాలి: మాజీ ఎమ్మెల్యే శ్రీదేవమ్మ ​దేవనబండ, ఎంపీటీసీ-7 స్థానాల్లో వైకాపా ప్రచారం బొల్లారం డివిజన్ లో పార్కింగ్ లేకుండా అక్రమ నిర్మాణాలు కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన గుంతపల్లి సర్పంచ్‌ అనంత్ రెడ్డి తిరుమల శ్రీవారి ప్రసాదం అందజేత కూటమి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి కృషి చేయాలి–: రాజ్యసభ ఎంపీ సానా సతీష్ బాబు పోలింగ్ ప్రక్రియను పరిశీలించిన జిల్లా కలెక్టర్ నాగరాణి శ్రీ మఠంలో 16 ఏళ్లలోపు చిన్నారులకు ఆయుర్వేద వైద్య సేవలు.. కొల్చారంలో పెద్దమ్మ తల్లి ఆలయ గడప ప్రతిష్ఠాపన మహోత్సవం

చెప్పామంటే చేస్తాం.. ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటున్నాం.

Select Suryaa Now
చెప్పామంటే చేస్తాం.. ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటున్నాం.

 

ప్రజల ఆశయాలకు ప్రతిరూపంగా.. అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న కూటమి ప్రభుత్వం.

కూటమి జడ్పీటీసీ అభ్యర్థి కైపు నాగలక్ష్మీ అత్యధిక మెజార్టీతో గెలిపించాలి.

తాళ్లూరు లో  ఇంటింటి ప్రచార కార్యక్రమంలో డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ

సూర్య న్యూస్ దర్శి.కూటమి పార్టీల తరఫున తాళ్లూరు మండలం జెడ్పీటీసి అభ్యర్థి  కైపు నాగలక్ష్మీనీ అఖండ మెజారిటీతోహ విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ, ఆదివారం మండలం లోని సోమరప్పాడు, తూర్పు గంగవరం గ్రామాలలో  యం . పి మాగుంట శ్రీనివాస రెడ్డి తో కలిసి ఎన్నికల ప్రచారంను దర్శి టిడిపి ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ , టిడిపి యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్ నిర్వహించారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా. గొట్టిపాటి లక్ష్మీ  ఇంటింటికీ తిరుగుతూ కూటమి ప్రభుత్వ ఆశయాలను, అభ్యర్థి విజయ ఆవశ్యకతను ప్రజలకు వివరించారు.

ఈ ప్రచార కార్యక్రమంలో తాళ్లూరు మండల టిడిపి అధ్యక్షులు మేడగం వెంకటేశ్వర రెడ్డి, జనసేన మండల పార్టీ అధ్యక్షులు కుటాల ప్రసాద్, తాళ్లూరు నూతన ఎంపీపీ అభ్యర్థి బొమ్మిరెడ్డి రమణమ్మ - ఓబుల్ రెడ్డి, టిడిపి నాయకులు మానం రమేష్ బాబు, దర్శి మున్సిపల్ నూతన చైర్మన్ దారం సుబ్బారావు, మాజీ జడ్పీటీసీ మారం యంకారెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ యిడమకంటి వెంకటేశ్వర రెడ్డి, తాళ్లూరు మండలంలోని వివిధ హోదాల్లో ఉన్న టిడిపి సీనియర్ నాయకులు ,కూటమి శ్రేణులు పాల్గొన్నారు.