BREAKING
వట్టిపల్లి మండల ఏర్పాటు వెనుక, కాంగ్రెస్ నాయకుల పోరాటం కీలకం. జేడీ చక్రవర్తికి అంతర్జాతీయ గౌరవం.. 'దాహిణీ: ది విచ్' మూవీకి బెస్ట్ యాక్టర్ అవార్డ్ సొంతం! వైభవంగా వేపచెట్టు కనకదుర్గమ్మ శరన్నవరాత్రి ఉత్సవాలు శ్రీకాళహస్తి పురపాలక సంఘం ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ పోటీ గుజ్జ సత్యానికి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి కల్పించాలి సత్యదేవ్, ఫరియా 'ట్రయల్ అండ్ ఎర్రర్'.. పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా ప్రారంభం! ఫిర్యాదు పరిష్కారమైతే సరిపోదు.. ప్రజలు సంతృప్తి చెందాలి..జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ పోలింగ్ కేంద్రాలు పరిశీలిస్తున్న శ్రీకాళహస్తి డిఎస్పి వరుణ్ సందేశ్ ‘కాస్ట్’ టీజర్ విడుదల.. హింసాత్మక, తీవ్రమైన డ్రామాగా సరికొత్త చిత్రం! పోలీసుల వేధింపులు తాళలేక… ఎల్ఎండీ పోలీస్ స్టేషన్ పై నుంచి దూకిన వ్యక్తి విజయదుర్గమ్మ వారి దేవి నవరాత్రుల ఉత్సవాలు.. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లపై స్పష్టతనివ్వాలి రాయదుర్గం కాంగ్రెస్‌లో భారీ చేరికలు గౌని ప్రతాపరెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన 26 కుటుంబాలు కాట్రేనికోనలో ఎమ్మెల్యే సుడిగాలి పర్యటన.. వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు.. టాలీవుడ్‌లోకి శ్రీకాంత్ కూతురు ఎంట్రీ.. హీరోయిన్‌గా అరంగేట్రం చేయనున్న మేధ!

చీమకుర్తి శ్రీ హరిహర క్షేత్రంలో వైభవంగా ప్రారంభం అయిన శ్రీ దేవి శరన్నవరాత్రుల ఉత్సవాలు.

Select Suryaa Now
చీమకుర్తి శ్రీ హరిహర క్షేత్రంలో వైభవంగా ప్రారంభం అయిన శ్రీ దేవి శరన్నవరాత్రుల ఉత్సవాలు.

చీమకుర్తి, మేజర్ న్యూస్ : 

బాలికలకు నవ దుర్గ పూజలు నిర్వహించిన శ్రీమతి లక్ష్మి పద్మావతి

 

చీమకుర్తి శ్రీ హరిహర క్షేత్రంలో ఆదివారం నుండి శ్రీ దేవి శరన్న వరాత్రుల ఉత్సవాలు వైభవంగా ప్రారంభం అయ్యాయి.మాజీమంత్రి డా. శిద్దా రాఘవరావు,శ్రీమతి శిద్దా లక్ష్మి పద్మావతి దంపతులు,శి ద్దా పాండురంగరావు దంపతులు,శిద్దా సుధాకర్ దంపతులు శ్రీ హరిహర క్షేత్రంలో వేంచేసి ఉన్న సకల దేవతలకు విశేష పూజలు నిర్వహించారు.అనంతరం శ్రీ దేవి శరన్నవరాత్రుల ఉత్సవాలలో భాగంగా శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అమ్మవారిని దర్శించుకొని ఆశీస్సులు అందుకున్నారు.

ఆదివారం ఉదయం శ్రీ వాసవి అమ్మవారికి పంచామృత సుగంధ ద్రవ్యాల అభిషేకాలు నిర్వహించి తదుపరి అమ్మవారికి శ్రీ చక్రార్చన సాయంత్రం ఉభయదాతల చే కుంకుమ అర్చన,అర్యవైశ్య మహిళలచే సామూహిక శ్రీ లలితా సహస్ర నామ సోస్త్రం,ఉభయదాతలచే కుంకుమ పూజ, నైవేద్యం,హారతి,తీర్థప్రసాదాల వినియోగం తొమ్మిది మంది బాలికలకు నవదుర్గ పూజలు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.సోమవారం రెండవ రోజు శ్రీ గాయత్రి దేవి అలంకారం మరియు సామూహిక హరిద్రా అభిషేకంతో భక్తులకు అమ్మవారు  దర్శన భాగ్యం కలిగిస్తారని ఆలయ అర్చకులు తెలిపారు.

 

దేవి శరన్నవరాత్రుల పునస్కారించుకొని శ్రీ హరిహర క్షేత్రం విద్యుత్ దీపాలతో అలంకరణతో క్షేత్రం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.అమ్మవారి దర్శనం కోసం మహిళలు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.శిద్దా వెంకటేశ్వర్లు,శ్రీమతి వెంకట సుబ్బమ్మ ట్రస్ట్ ఆధ్వర్యంలో భక్తులకు తీర్థప్రసాదాలు అల్పాహారం,వాహన సౌకర్యం ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో శిద్దా సుధాకర్ దంపతులు, సువర్చల,అరుణ,ఆర్యవైశ్య మహిళలు,భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.