BREAKING
మాజీ మండల అధ్యక్షుడి జన్మదిన వేడుకల్లో ఆర్‌బీఓఎల్ సీఈవో జాతీయస్థాయిలో సత్తా చాటిన ఉమామహేశ్వరపురం విద్యార్థిని. దళిత ఉప సర్పంచ్ పై దాడిని నిరసిస్తూ పోలీస్ స్టేషన్ ముందు దళిత, బహుజన సంఘాల ధర్నా పేరూరు గురుకులంలో ఆధునిక హంగులు పేదలకు ఉచిత నిత్యవసర సరుకుల పంపిణి కండ్లకోయలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ఇళ్ల నిర్మాణాలు వెంటనే ప్రారంభించాలి సింగరేణి కార్మికులకు రూ.1.10 లక్షల దీపావళి (పీఎల్ఆర్) బోనస్ యువత నైపుణ్యాలను పెంపొందించుకోవాలి దోర్నాలకు త్వరలో అన్నా క్యాంటిన్… స్వచ్ఛ అవార్డ్ గ్రహీత గ్రామ కార్యదర్శి కి ఘన సన్మానం ఓబీసీల సింహగర్జనకు తరలి రావాలి 34 శాతం బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి శివాజీ పార్క్ నిరసనలో షబానా ఆజ్మీ, నసీరుద్దీన్ షా: ఓటర్ల జాబితా అక్రమాలపై సీజేపీ ఆందోళనకు సినీ ప్రముఖుల మద్దతు, నిర్వాహకులపై కేసు నమోదు దురద కుంటలో ఎస్ఎంసి ఎన్నికలు ప్రశాంతం, మల్లాపురంలో వాయిదా.

భూసేకరణలో నిర్లక్షం, అలసత్యం వహించే అధికారులుపై చర్యలు తప్పవు*

Select Suryaa Now
భూసేకరణలో నిర్లక్షం, అలసత్యం వహించే అధికారులుపై చర్యలు తప్పవు*

ఏలూరు మేజర్ న్యూస్ : జిల్లా కలెక్టరేటు గౌతమీసమావేశ మందిరంలో శనివారం చింతలపూడి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టుకు భూసేకరణ పనులు పురోగతిపై సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి అధ్యక్షతన సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. జిల్లా కలెక్టరుతో పాటు జిల్లా జాయింటు కలెక్టరు డా.యం.జె.అభిషేక్ గౌడ, అసిస్టెంటు కలెక్టరు సి.హెచ్. శ్రావణ్ కుమార్ రెడ్డి, నూజివీడు సబ్ కలెక్టరు బొల్లిపల్లి వినూత్న లు పాల్గొన్నారు. ప్రాజెక్టు పనులు పురోగతి, ఇప్పటివరకు భూసేకరణ చేసిన భూములు, ఎన్ని ఎకరాలకు పరిహారం చెల్లించారు, ఇంకా ఎన్ని ఎకరాలకు పరిహారం చెల్లించాలి, ఇంకా ఎన్ని ఎకరాలు భూసేకరణ చెయ్యాలి, తదితర అంశాలుపై జిల్లా కలెక్టరు సమీక్షించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ చింతలపూడి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టుకు భూసేకరణ ప్రక్రియను వేగవంతం చెయ్యాలని, పనులు పురోగతిపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. భూసేకరణలో నిర్లక్షం, అలసత్యం వహించే అధికారులుపై చర్యలు తప్పవని అన్నారు. ప్రాజెక్టు పరిధిలో భూములు కోల్పోతున్న రైతులకు ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలు ప్రకారం నష్టపరిహారం త్వరితగతిన అందేలా చర్యలు తీసుకోవాలని, ఎక్కడా ఎలాంటి జాప్యానికి తావులేకుండా క్షేత్రస్థాయి పరిశీలనలు పూర్తి చెయ్యాలని అన్నారు. భూసేకరణకు సంబంధించి ఏవైనా న్యాయపరమైన లేదా క్షేత్రస్థాయి సమస్యలు ఉంటే రైతులతో మాట్లాడి సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని స్పష్టం చేశారు. రెవెన్యూ, ప్రాజెక్టు అధికారులు, జలవనరులు, సంబంధిత శాఖలు అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేసి నిర్దేశిత గడువులోగా భూసేకరణ పూర్తిచేసి పనులకు అప్పగించాలని ఆదేశించారు. ​ప్రాజెక్టు పనులను వేగవంతం చేయడం ద్వారా రైతులకు సాగునీరు అందించే ప్రభుత్వ లక్ష్యాన్ని సాకారం చెయ్యాలని, మిగిలిన పనులుపై లక్ష్యాలను అధిగమించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో పులిచింతల యస్ఇ జి.రామకోటేశ్వరరావు, కొవ్వూరు యస్డిసి ఏ.శ్రీశిల్పి, ఆయా మండలాలు తహశీల్దార్లు, డిప్యూటీ తహశీల్దార్లు, మండల సర్వేయర్లు, జిల్లా కలెక్టరేటు సూపర్డెంట్లు, తదితరులు పాల్గొన్నారు.

 జిల్లా ఇన్చార్జి పసుమర్తి రాము