భీమవరం రైల్వే స్టేషన్‌లో 7.5 కిలోల గంజాయి స్వాధీనం ముగ్గురు మహిళల అరెస్ట్
భీమవరం, సూర్య న్యూస్: భీమవరం రైల్వే స్టేషన్‌లో గంజాయి తరలిస్తున్న ముగ్గురు మహిళలను జీఆర్‌పీ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి సుమారు 7.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.పోలీసులకు అందిన సమాచారం మేరకు, భీమవరం జంక్షన్ రైల్వే స్టేషన్‌లోని ప్లాట్‌ఫామ్ నంబర్–1 వెయిటింగ్ హాల్‌లో సిబ్బంది, మధ్యవర్తులతో కలిసి తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అనుమానాస్పదంగా కనిపించిన ముగ్గురు మహిళలను అదుపులోకి తీసుకుని విచారించగా, వారి వద్ద గంజాయి లభ్యమైంది. దీంతో గంజాయి కేసు నమోదు చేసి, ముగ్గురిని చట్టప్రకారం అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
రిపోర్టర్ శ్రీనివాస్ భీమవరం పశ్చిమగోదావరి జిల్లా