భక్తిశ్రద్ధలతో నాగుల చవితి జరుపుకున్న స్పీకర్ అయ్యన్నపాత్రుడు కుటుంబం
నర్సీపట్నం నవంబర్ 13 మేజర్ న్యూస్ :
శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు తన కుటుంబ సభ్యులతో కలిసి నాగుల చవితి పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆయన సతీమణి, మున్సిపల్ చైర్ పర్సన్ చింతకాయల పద్మావతి, తనయుడు, టీడీపీ పట్టణ అధ్యక్షులు చింతకాయల రాజేష్, కోడలు దివ్యశ్రీ తదితర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా స్పీకర్ అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ తన కుటుంబ సభ్యుల తరపున తెలుగు ప్రజలందరికీ మనఃస్ఫూర్తిగా నాగుల చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. గతంలో మన రాష్ట్రం చాలా నష్టపోయింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రధానమంత్రి , చంద్రబాబు నాయుడు , పవన్ కళ్యాణ్ గారు ఏర్పాటు చేసిన ఈ ప్రభుత్వం ద్వారా ఇప్పుడిప్పుడే నష్టపోయిన రాష్ట్రాన్ని బాగుచేసుకునే ప్రయత్నాలు చేస్తున్నాం అని అన్నారు. ఇందుకు ప్రజలందరూ సహకరిస్తున్నారు, వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. రాబోయే రోజుల్లో కూడా ప్రజలందరూ రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోవాలి. రాష్ట్రం బాగుంటే, అభివృద్ధి చెందితేనే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుందనే ఆలోచనతో మనందరం కలిసి పనిచేద్దాం అని పిలుపునిచ్చారు.