BREAKING
వట్టిపల్లి మండల ఏర్పాటు వెనుక, కాంగ్రెస్ నాయకుల పోరాటం కీలకం. జేడీ చక్రవర్తికి అంతర్జాతీయ గౌరవం.. 'దాహిణీ: ది విచ్' మూవీకి బెస్ట్ యాక్టర్ అవార్డ్ సొంతం! వైభవంగా వేపచెట్టు కనకదుర్గమ్మ శరన్నవరాత్రి ఉత్సవాలు శ్రీకాళహస్తి పురపాలక సంఘం ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ పోటీ గుజ్జ సత్యానికి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి కల్పించాలి సత్యదేవ్, ఫరియా 'ట్రయల్ అండ్ ఎర్రర్'.. పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా ప్రారంభం! ఫిర్యాదు పరిష్కారమైతే సరిపోదు.. ప్రజలు సంతృప్తి చెందాలి..జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ పోలింగ్ కేంద్రాలు పరిశీలిస్తున్న శ్రీకాళహస్తి డిఎస్పి వరుణ్ సందేశ్ ‘కాస్ట్’ టీజర్ విడుదల.. హింసాత్మక, తీవ్రమైన డ్రామాగా సరికొత్త చిత్రం! పోలీసుల వేధింపులు తాళలేక… ఎల్ఎండీ పోలీస్ స్టేషన్ పై నుంచి దూకిన వ్యక్తి విజయదుర్గమ్మ వారి దేవి నవరాత్రుల ఉత్సవాలు.. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లపై స్పష్టతనివ్వాలి రాయదుర్గం కాంగ్రెస్‌లో భారీ చేరికలు గౌని ప్రతాపరెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన 26 కుటుంబాలు కాట్రేనికోనలో ఎమ్మెల్యే సుడిగాలి పర్యటన.. వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు.. టాలీవుడ్‌లోకి శ్రీకాంత్ కూతురు ఎంట్రీ.. హీరోయిన్‌గా అరంగేట్రం చేయనున్న మేధ!

బీసీల రాజకీయ సాధికారతకు, సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది

Select Suryaa Now
బీసీల రాజకీయ సాధికారతకు, సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది

*నాడు జగన్  బీసీ రిజర్వేషన్లను 24 శాతానికి తగ్గించి బీసీలకు ద్రోహం చేశారు* 

*సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తూనే స్థానిక ఎన్నికల్లో పార్టీ పరంగా బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు* 

*మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి* 

సూర్య ప్రతినిధి, ఒంగోలు : 

బీసీల రాజకీయ సాధికారతకు, సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు. ఆదివారం ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండల టీడీపీ కార్యాలయంలో బీసీ సోదరులతో నిర్వహించిన సమావేశంలో మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ....బీసీలకు రాజ్యాధికారం.. కూటమి ప్రభుత్వ ధ్యేయమన్నారు. నాడు జగన్  బీసీ రిజర్వేషన్లను 34 నుంచి 24 శాతానికి తగ్గించి.. స్థానిక సంస్థల ఎన్నికల్లో 16,800 మందికి రాజకీయ పదవులు దూరం చేశారన్నారు. నేడు టీడీపీ బీసీలకు మళ్ళీ 34 శాతం రిజర్వేషన్ కల్పిస్తే జగన్ అండ్ కో కోర్టుల్లో కేసులు వేసి అడ్డుకున్నారన్నారు. బీసీలు రాజకీయంగా ఎదగకూడదనే గొడ్డలి పార్టీ కుట్రలు చేస్తోందని మండిపడ్డారు. గొడ్డలి పార్టీ 5 ఏళ్ల పాలనలో బీసీలను నిత్యం దాడులు, దౌర్జన్యాలకు తెగబడ్డారన్నారు. టీడీపీతోనే బడుగు, బలహీన వర్గాలకు రాజకీయ స్వాతంత్రం లభించిందన్నారు.  బీసీలకు 34 శాతం  రిజర్వేషన్‌పై టీడీపీ కట్టుబడి ఉందని సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తూనే పార్టీ పరంగా బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఇస్తామని తెలిపారు. పంచాయతీ వార్డుల్లో బీసీలకు 26.73 శాతం సీట్లు, సర్పంచ్‌లు 27.95%, MPPలు 24.6% సీట్లు, ZPTCలు 24.6%, ZP చైర్మన్లు 23.08% సీట్లు,  మున్సిపల్ చైర్మన్లు 33.02%, అర్బన్ వార్డుల్లో 32.78%, మేయర్లు బీసీలకు 35.29% సీట్లు ఇచ్చేందుకు తెలుగుదేశం సిద్ధంగా ఉందని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి తెలిపారు.